రాయలేక పోవడం కూడా
అక్షరాల ఆత్మీయతను తెలుపుతుంది...
ఆకు రాలిన కాలంలో
పచ్చదనం గొప్పదనంలా...
గొంతెండిన వేళ
నీటి చుక్క దొరకనితనంలా...
చెప్పుల్లేని ఎండాకాలంలో
తారంటుతున్న పాదం మంటలా...
దుప్పటి దొరకని
చలిరాత్రి నిప్పు రాజేయలేనితనంలా...
కాలుతున్న కడుపులో
ఓ ముద్ద వేయలేనితనంలా...
చుట్టూ అక్షరాలన్నీ ఒక్కోటీ
వెక్కిరిస్తూ ఉలికి అందని శిలలా....
కుంచెకంటని రంగు
కాగితంపై అటూ ఇటూ అలుక్కుపోయినట్టుగా...
గొంతు దాటని రాగం
లోలోన సుళ్ళు తిరుగుతూ ఊపిరాడనితనంలా....
ఏదీ రాయలేనితనం పాడలేనితనం
దృశ్యీకరించలేనితనం ఎడారితనం కదా...
అక్షరాల ఆత్మీయతను తెలుపుతుంది...
ఆకు రాలిన కాలంలో
పచ్చదనం గొప్పదనంలా...
గొంతెండిన వేళ
నీటి చుక్క దొరకనితనంలా...
చెప్పుల్లేని ఎండాకాలంలో
తారంటుతున్న పాదం మంటలా...
దుప్పటి దొరకని
చలిరాత్రి నిప్పు రాజేయలేనితనంలా...
కాలుతున్న కడుపులో
ఓ ముద్ద వేయలేనితనంలా...
చుట్టూ అక్షరాలన్నీ ఒక్కోటీ
వెక్కిరిస్తూ ఉలికి అందని శిలలా....
కుంచెకంటని రంగు
కాగితంపై అటూ ఇటూ అలుక్కుపోయినట్టుగా...
గొంతు దాటని రాగం
లోలోన సుళ్ళు తిరుగుతూ ఊపిరాడనితనంలా....
ఏదీ రాయలేనితనం పాడలేనితనం
దృశ్యీకరించలేనితనం ఎడారితనం కదా...
ఏమీ చేయలేనప్పుడే తెలుస్తుందేమో...
ReplyDeleteచేస్తే ఉండే హాయి, ఆనందం ఏమిటో...
అభినందనలు వర్మ గారూ!
చాలా బాగుంది..
@శ్రీ
మీరలా వివరణాత్మక స్పందనతో భుజం తట్టినందుకు ధన్యవాదాలు శ్రీ గారూ..
Deleteచాలా బాగుంది.. వర్మ గారూ!
ReplyDeleteథాంక్యూ Kittu గారూ..
Deleteరాయలేనితనం
ReplyDeleteఎడారితనం...అంటూ
ఆపేయకండి...:-)
Pic is so cute!
అప్పుడప్పుడూ అలా ఆగితే మరలా కొత్త చిగుళ్ళు తొడుగుతాయని పద్మ గారూ..థాంక్యూ మీలాంటి చిత్రకారులకు పిక్ నచ్చినందుకు..
Deletedifferent one.
ReplyDeleteThank you very much oddula ravisekhar gaaru..
Deleteవర్మగారూ , ఇది ఓ నిరాశా భావన. ఏదో లేదు అనుకొనే సూన్య స్థితి,
ReplyDeleteఎడారితనం వెలితి తనం, ప్రతి ఒక్కరూ ఉలి చేత పడితే శిల్పి అవుతారు.
కాకుంటే ఎన్నుకొనే రాయి( బాట ) సరైనది కావాలి. కవిత బాగుంది.
భావనలలో అన్నీ కలగలిస్తేనే కదా మనిషి మేడం....మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు ఫాతిమాజీ...
Deleteఇంతందంగా రాసేస్తూ మేమంతా ఉండగా రాయలేనితనం ఎడారితనం ఒంటరితనం ఏంటండి?:)
ReplyDeleteమీరంతా వున్నారన్న భరోసా యిచ్చినందుకు ధన్యవాదాలు అనికేత్...
Deleteతడారితే ఎడారి. మీది వెన్నెల దారి.ఏదీ దాయలేనితనం. అదే రాయిస్తుంది. పూయిస్తుంది. :)
ReplyDeleteమీ ఆత్మీయ విశ్లేషణకు ధన్యవాదాలు SKY గారూ..:)
ReplyDeletemIku nachchina kavitala sateesh nI,..sKY nI, nEnE varma gaaru.. manaM OkaTE.
ReplyDeletebvv prasad gaari kavitvaM chadavaMDi. meeku nachchutumdi.