Saturday, August 18, 2012

వాగ్ధానం..

నీవు చేత పట్టిన ఎర్ర జెండా
నేల నాలుగు చెరగులా
పచ్చదనాన్ని పూత వేస్తుంది...

నీ ముఖాన ఈ చిర్నవ్వు

లోకమంతా వెలుగు దివ్వె కావాలి...

కాలి కింది నేల

కార్పొరేట్ సొంతమవుతున్నప్పుడు
చేతపట్టిన ఈ అరడుగు ఎర్ర గుడ్డ
వాడిని పరుగు పెట్టిస్తుంది...

క్రొన్నెత్తురుతో తడిసిన

ఈ జెండా రేపటి తరానికి
భవిష్యత్తును వాగ్ధానం చేస్తుంది...

8 comments:

  1. పచ్చదనంతో నిండిపోవాలి ఆ పసివాని జీవితమని తిలకందిద్దక నెత్తురుతో తడిసిన వాగ్ధానమని అంటే కాస్తంత ఇబ్బందిగా ఉందండి వర్మగారు.....మన్నించాలి!

    ReplyDelete
    Replies
    1. ఆ పసివాని వంటి వారి భవిష్యత్తరాలకోసం నెత్తురు చిందిస్తున్న నేటి తరం త్యాగాన్ని కొనియాడకుండా ఎలా వుండగలను ప్రేరణ గారూ..అందరికీ ప్రాణమైన నెత్తురుతో ఇబ్బందేముంది చెప్పండి...మన్నించడాలు వదిలేద్దాం...:)

      Delete
  2. ఎరుపంటే కొందరికీ భయం భయం
    పసిపిల్లలు వారికన్న నయం నయం..

    ఎరుపు రంగు కాదు ఎన్నటికి అపాయం
    అది ఉపాయాన్ని చూపించే ఒక సదుపాయం...
    (కా.చెరబండరాజు అమర్ రహే)

    ReplyDelete
    Replies
    1. ప్రజా కవి చెరబండరాజు అమర్ రహే...
      థాంక్యూ వడ్రంగిపిట్ట గారూ..

      Delete
  3. మీ భావాలూ చాల బాగుంది . కానీ నేటి ఎర్ర జెండాలు ఇతరుల అ జెండా లతో కలసి పని చేస్తున్నాయి . ప్రజలకు ఎరుపు మీద నమ్మకం పోతుంది ..ఇంకా చెప్పాలి అంటే పోయింది .

    ReplyDelete
    Replies
    1. ఎఱ జెండాలన్నీ ఒకటి కావు బల్లికురవ వెంకట్.ఎన్నికల కుళ్ళు రాజకీయాల మత్తులో అధికారం వెంట పరుగులు పెడ్తున్న అవకాశవాదులది నకిలీ జెండా...
      నెత్తుటి త్యాగాలతో ఎరుపెక్కుతున్న జెండాయే మనకాదర్శం...ప్రజల నమ్మకమెక్కడికీ పోలేదు...

      Delete
  4. అర అడుగు యెర్ర గుడ్డ పరుగులు పెట్టిస్తుంది
    చిన్న కవిత అయినా ఆలోచింప చేస్తుంది

    ReplyDelete
  5. కవితా భావన చాలా బాగుంది. వర్మాజీ.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...