ఈ తెల్లవారే సూరీడు
ముఖాన మీ నెత్తురి మరక...గాయపడ్డ అడవి
గర్భశోకంతో నెత్తురు మడుగైంది...
ఒక్కొక్కరు ఒకే కలను కంటూ
ఒరిగి పోతూ పిడికిలెత్తుతూ...
చుట్టూరా కమ్ముకున్న వేట గాళ్ళ
మధ్య పోరాడుతూ మందుగుండవుతూ...
వారి కలలను చిదిమేయాలని
గుండెలపైనే కాదు మెదళ్ళనూ చీలుస్తూ గుళ్ళ వర్షం...
నవ్వుతూ వాడి ఓటమిని
చూస్తూ ఎరుపెక్కిన తూరుపు తీరం...
ఆశయాలను అంతం చేయాలన్న
వాడి కలను చిద్రం చేస్తూ తూటా దెబ్బతిన్న లేగ దూడ రంకెవేస్తూ....
దేహమంతా కప్పుకున్న నెత్తుటి వస్త్రాన్ని
జెండాగా ఎగురవేస్తూ అడవి తల్లి దిక్కులు పిక్కటిల్లెలా నినదిస్తూ...
(1998 ఆగస్టు 9 న ఒరిస్సా రాష్ట్రంలోని కోపర్ డంగ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పులలో్ అమరులైన 13 మంది ప్రజావీరుల స్మృతిలో. తొలిసారిగా రాజ్యం హెలికాప్టర్ నుండి కాల్పులు జరిపిన దారుణ సంఘటన.)
వర్మగారు.....ఇలాంటివి జరిగినప్పుడు
ReplyDeleteవాటిని తలుచుకుని, అయ్యో ఎంత ఘోరం అనుకోవడం తప్ప ఏమంటాం చెప్పండి?
పద్మార్పిత గారూ ఎంత ఘోరం అనుకున్న మీ మనసు గొప్పదనం తెలుస్తోంది.. అలా అనుకోవడానికి వెరసే వాళ్ళ కాలమిది కదా... మీ ఆత్మీయతకు ధన్యవాదాలు..
Deleteవర్మగారూ, మీ కలానికి, దయా హృదయానికి నా సలాం.
ReplyDeleteఆశయాలను అనగద్రోక్కుతూ, అడుగడుగునా రక్తమోడుతూ, జగతి మీద రుధిర ధార కురుస్తూనీ ఉంది.
మన కేకలు అరణ్య రోదనలే, మన మాటలు మూగ వేదనలే.
సర్ కదల్చండి కలాన్ని ఒక్క అక్షర తూటా అయినా ఏ గుండెనైనా తాక గలిగితే మనం ధన్యులమే.
మీ కవితల్లో ఈ ఉద్వేగమే నాకు నచ్చుతుంది.
ఫాతిమా గారూ మీ ఆత్మీయ కరచాలనానికి ధన్యవాదాలు..తప్పక ప్రయత్నిస్తాను...
Delete