అలా ఓ చాప చుట్టలో ఎర్రటి ముద్దలా
నువ్వొచ్చి వెలుగుతున్నప్పుడు....
అంతా గుమిగూడి నీ పేరు చుట్టూ
ఓ గేయాన్ని ఆలపిస్తున్నప్పుడు...
అమ్మ తన కంటి ధారను రెప్పల మాటున
ఉగ్గబట్టి నీ కనుపాపలు ముద్దాడుతున్నప్పుడు...
నీ ఒంటి గాయాలను తడుముతు వేళ్ళ చివరి అంచుల
నాన్న వెన్నపూసవుతున్నప్పుడు...
ఆమె దు:ఖాన్ని గొంతులో సుళ్ళుతిరుగుతుండగా
నేలపై నీ పేరును ముగ్గు వేస్తున్నప్పుడు...
గోధూళి వేళ లేగ దూడ మూగగా
తల్లి పొదుగును చేరక దిగులుపడుతున్నప్పుడు...
తూర్పు వాకిట కాకులన్నీ గుంపుగా
నీ చావు అబద్ధమని చాటుతున్నప్పుడు...
వెలుతురు పిట్టలు నీ గుండెలపై
ఎర్ర వస్త్రం అలంకరిస్తున్నప్పుడు....
నెత్తురు చిమ్మిన ముఖంతో సూరీడు రేపటి ఉదయాన్ని
వాగ్ధానం చేస్తూ నేల తల్లి ఒడిలో వాలిపోతూ.....
WOW! Superb!
ReplyDeleteచాలా బాగుందండి వర్మ గారు. మీ కవితలన్ని పుస్తకం లా పబ్లిష్ చెయ్యండి..ఆ విషయం మరచినట్టున్నారు.
థాంక్యూ జలతారు వెన్నెలగారూ...
Deleteఈ సంవత్సరాంతానికి వేసే ప్రయత్నంలో వున్నాను..మీ ప్రోత్సాహానికి సదా కృతజ్నున్ని...
చాలా బాగుంది వర్మ గారూ!
ReplyDeleteనెత్తురు చిమ్మిన ముఖంతో సూరీడు రేపటి ఉదయాన్ని
వాగ్దానం చేస్తూ నేల తల్లి ఒడిలో వాలిపోతూ
అభినందనలు మీకు
@శ్రీ
మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు శ్రే గారూ..
Deleteవర్మాజీ, ఏమిచెప్పను బాగుంది అనలేను.
ReplyDeleteకవిత బాగుంది కానీ ఓ త్యాగానికి ఓ ప్రాణం సమిది కావటం బాగుండదు కదా.
ఓ ఆశయం కోసం , ఓ ద్యేయం కోసం అర్పణ కావటం అందరూ చేయలేరు.
కానీ ఈ సూర్యులు ఎప్పుడూ అస్తమించరు. మళ్ళీ ,మళ్ళీ ఉదయిస్తారు.
మీ అక్షరాలలో వేదన కనిపిస్తుంది. ఇలా రాలిపోయే తారకలెన్నో,
ఆరిపోయే దీపాలెన్నో. వారివెనుక ఆశయం గొప్పదైతే అదే ఇంకో దీపానికి ఊపిరి పోస్తుంది....మెరాజ్
వారి త్యాగాలను గుర్తిస్తూ మీరందించిన సందేశాత్మక స్పందనకు ధన్యవాదాలు ఫాతిమాజీ...
Deleteవెన్నెలదారిలో పచ్చికబయలంటి ప్రేమకన్నా ఆర్ద్రతతోకూడిన ఎరుపంటేనే మీకు మక్కువని చెప్పకనే చెప్పేస్తుంటారు అప్పుడప్పుడూ ఇలా:-)
ReplyDeleteమీరలా నన్ను చదివి చెప్తే మరేమనగలను పద్మగారూ...:)
Deleteమీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు..
గుండె బరువెక్కి,మనసు తలుపు తట్టి పలికిన ఈ కవిత కదిలించింది.ఆ సంఘటనతో ఎంతో బాధకు గురయిన మనసే ఇలాంటి కవిత రాయగలదు .
ReplyDeleteఅమ్మ తన కంటి ధారను రెప్పల మాటున
ఉగ్గబట్టి నీ కనుపాపలు ముద్దాడుతున్నప్పుడు...ఈ వాక్యం తల్లి పడే వేదనకు పరాకాష్ట .
మీ ఆప్తవాక్యానికి ధన్యవాదాలు రవిశేఖర్ గారూ...
Deleteవర్మగారు....నిజంగా వెలుతురు పిట్టలు అనే జాతి ఉన్నాయాండి!
ReplyDeleteఆ జాతి వుందొ లేదో తెలియదు గానీ అలాంటి మనసున్న మనుషులున్నారు కదా మన మధ్య సృజన గారూ..
Delete