ఆది అంతం మధ్య
ఊగిసలాట నా హృదయ విలాసం...
అక్షరాలన్నీ అనుభూతుల దారంతో కుట్టుకుంటూ
ఓ వీలునామా నా కవిత్వం...
ఆ మధ్యన ఓ చిగురాకు నునులేతదనాన్నిఅద్ది
ఇంత లేలేత వర్ణాన్ని పొదిగి
అప్పుడే అరవిచ్చుకున్న శిశువు కనుదోయిలా
కాగితంపై ఒలికిపోతూ...
పంచుకున్నది విషాదమైనా ఆనందార్ణవమైనా
ఓ నిటారు కొమ్మలా స్వేచ్చగా
లేలేత సూర్య కిరణంలా
ఓ గాలి తిమ్మెరలా
కొండరాతిమీంచి జారిపడే జలపాతంలా
సహజంగా సహానుభూతిగా
ఓ మెత్తని ముఖమల్ స్పర్శలాంటి కరచాలనంలా
హృదయాన్ని తాకాలన్నదే నా స్వప్నం...
ఊగిసలాట నా హృదయ విలాసం...
అక్షరాలన్నీ అనుభూతుల దారంతో కుట్టుకుంటూ
ఓ వీలునామా నా కవిత్వం...
ఆ మధ్యన ఓ చిగురాకు నునులేతదనాన్నిఅద్ది
ఇంత లేలేత వర్ణాన్ని పొదిగి
అప్పుడే అరవిచ్చుకున్న శిశువు కనుదోయిలా
కాగితంపై ఒలికిపోతూ...
పంచుకున్నది విషాదమైనా ఆనందార్ణవమైనా
ఓ నిటారు కొమ్మలా స్వేచ్చగా
లేలేత సూర్య కిరణంలా
ఓ గాలి తిమ్మెరలా
కొండరాతిమీంచి జారిపడే జలపాతంలా
సహజంగా సహానుభూతిగా
ఓ మెత్తని ముఖమల్ స్పర్శలాంటి కరచాలనంలా
హృదయాన్ని తాకాలన్నదే నా స్వప్నం...
చాలా బాగారాసారండి.
ReplyDeleteThank you yohanth garu..
Deleteమీ స్వప్నానికావల మీరడిగిన ముఖమల్ స్పర్శలాంటి కరచాలా హృదయాన్ని తాకాలన్న మీ స్వప్నం తెలుపుతుందిలెండి మీలోని నిడారంభత్వం:-)
ReplyDeleteమీ ఆత్మీయ కరస్పర్శలాంటి స్పందనకు ధన్యవాదాలు పద్మార్పిత గారూ..:-)
Deleteచాలా హృదయాలను తాకాలని ఆశిస్తూ,
ReplyDeleteచక్కని కవితకి, అభినందనలు.
నా వరకు ఒక్క హృదయాన్ని తాకితే చాలు భాస్కర్జీ..:-)
Deleteమీ అభిమానానికి ధన్యవాదాలు..
వర్మాజీ, హృదయ విలాసం బాగుంది. నిజంగా అక్షరాలన్నిటిని చక్కగా అమర్చారు.
ReplyDeleteమీకు నచ్చినందుకు సుమాభివందనాలు ఫాతిమాజీ...
Delete"ఆది అంతం మధ్య ఊగిసలాట నా హృదయ విలాసం..."
ReplyDeleteఊగిసలాటేంటండీ స్థిరనివాసమే ఏర్పరుచుకుని ఉంటారు ఇలా అందమైన కవితలల్లి :)
నిజమేనా?? మీరు చెప్పాక కాదనగలనా ప్రేరణ గారూ...థాంక్యూ..:)
Deleteఎన్నో అందమైన అక్షరాల కదంబమాల మీ ఈ హృదయ విలాసం...
ReplyDeleteమీ అభిమాన స్పందనకు ధన్యవాదాలండీ అనికేత్...
Delete