Friday, August 3, 2012

స్వప్నానికావల...


ఆది అంతం మధ్య
ఊగిసలాట నా హృదయ విలాసం...

అక్షరాలన్నీ అనుభూతుల దారంతో కుట్టుకుంటూ
ఓ వీలునామా నా కవిత్వం...

ఆ మధ్యన ఓ చిగురాకు నునులేతదనాన్నిఅద్ది
ఇంత లేలేత వర్ణాన్ని పొదిగి
అప్పుడే అరవిచ్చుకున్న శిశువు కనుదోయిలా
కాగితంపై ఒలికిపోతూ...

పంచుకున్నది విషాదమైనా ఆనందార్ణవమైనా
ఓ నిటారు కొమ్మలా స్వేచ్చగా
లేలేత సూర్య కిరణంలా
ఓ గాలి తిమ్మెరలా
కొండరాతిమీంచి జారిపడే జలపాతంలా
సహజంగా సహానుభూతిగా
ఓ మెత్తని ముఖమల్ స్పర్శలాంటి కరచాలనంలా
హృదయాన్ని తాకాలన్నదే నా స్వప్నం...

12 comments:

  1. చాలా బాగారాసారండి.

    ReplyDelete
  2. మీ స్వప్నానికావల మీరడిగిన ముఖమల్ స్పర్శలాంటి కరచాలా హృదయాన్ని తాకాలన్న మీ స్వప్నం తెలుపుతుందిలెండి మీలోని నిడారంభత్వం:-)

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ కరస్పర్శలాంటి స్పందనకు ధన్యవాదాలు పద్మార్పిత గారూ..:-)

      Delete
  3. చాలా హృదయాలను తాకాలని ఆశిస్తూ,
    చక్కని కవితకి, అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. నా వరకు ఒక్క హృదయాన్ని తాకితే చాలు భాస్కర్జీ..:-)
      మీ అభిమానానికి ధన్యవాదాలు..

      Delete
  4. వర్మాజీ, హృదయ విలాసం బాగుంది. నిజంగా అక్షరాలన్నిటిని చక్కగా అమర్చారు.

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు సుమాభివందనాలు ఫాతిమాజీ...

      Delete
  5. "ఆది అంతం మధ్య ఊగిసలాట నా హృదయ విలాసం..."
    ఊగిసలాటేంటండీ స్థిరనివాసమే ఏర్పరుచుకుని ఉంటారు ఇలా అందమైన కవితలల్లి :)

    ReplyDelete
    Replies
    1. నిజమేనా?? మీరు చెప్పాక కాదనగలనా ప్రేరణ గారూ...థాంక్యూ..:)

      Delete
  6. ఎన్నో అందమైన అక్షరాల కదంబమాల మీ ఈ హృదయ విలాసం...

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలండీ అనికేత్...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...