Friday, August 24, 2012

సగం కాలిన నెలవంక..


ఆకాశమంత అందనంత ఎత్తులో
నీవు...

నేలబారున అగాథపు అంచుల లోయలో
నేను...

దేహమంతా పూసుకున్న నీ ఊహల పరిమళంతో
నేను...

ఒక్క మాట కూడా రాని మౌన ప్రమాణంతో
నీవు...

రాని అతిథిలా సుదూర తీరాన ఒంటరి నావపై
నీవు...

కాలమంతా కరిగిపోతూన్న మంచు గడ్డపై
నేను...

శిశిరాన మునిమాపు వేల మబ్బుల తెరల మాటున దాగిన వెన్నెలలా
నీవు...

ఎడారి అంచుల కాష్టపు కారు మేఘాల మాటున సగం కాలిన నెలవంకలా
నేను...


19 comments:

  1. ప్రేమని కూడా విప్లవభావాలతో కట్టేయడం మీకే తగునండి!:-)

    ReplyDelete
    Replies
    1. అలా నా మనసును చదివిన మీకు ధన్యవాదాలు పద్మార్పిత గారూ..:-)

      Delete
  2. బహుకాల బ్లాగ్ దర్శనం వర్మగారు:)
    నువ్వు-నేను అంటూ సగం కాలడం ఎందుకండి
    చల్లని వెన్నెలజల్లులో పూర్తిగా తడిసి ముద్దైపొండి:)

    ReplyDelete
    Replies
    1. మీరిచ్చే ప్రేరణతో అలా తడిసి పోతా లెండి..:)
      మీ ఆత్మీయతకు ధన్యవాదాలు...

      Delete
  3. వర్మ గారూ, భావం అద్బుతంగా ఉంది.
    ఓ హృదయం తాను మరో హృదయాన్ని అందుకోలేనే అనుకొనే వేదన ఎంత సూటిగా చెప్పారో,
    నేను చాలా సార్లు ఇలాంటి కవితలు రాయటానికి ప్రయత్నించాను కాని ఇంత సింపుల్ గా అందంగా చెప్పలేక పోయానేమో.
    వర్మగారూ, చాలా బాగా రాసారండి.

    ReplyDelete
    Replies
    1. అలా మొదలు తుదిలలో గారూ అంటూ దూరంగా తరిమేయకండి ఫాతిమాజీ..ః-)
      మీరంతలా మెచ్చుకుంటే గాల్లో తేలిపోనా...అయినా తెలుగు పండితులతో ఈ పామరుడు పోటీపడలేడు...
      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు...

      Delete
  4. ఈ కవిత చదువుతుంటే ముకేష్ గారి పాట వింటున్నట్లుంది.
    అందనంత ఎత్తులో ఆమె, అఘాధంలో మీరు:)
    ఎప్పుడూ ఉన్నత స్థానం తనకేనన్నమాట!
    చాలా బాగా రాసారండి.

    ReplyDelete
    Replies
    1. అవునా...ఇంత గొప్ప కాంప్లిమెంటు ఇచ్చినందుకు మీకో పెర్క్ అనికేత్..థాంక్యూ...
      నిజమే... ఆ సమున్నత స్థానమెప్పుడూ తనదే...

      Delete
  5. వర్మ గారు మీ కవితలోని పద ప్రయోగం చాలా బాగుంది చక్కటి పదాలతో వేదనను హృదయానికి హత్తుకునేలా రాసారు....

    ReplyDelete
    Replies
    1. మీ కవితాత్మీయతకు ధన్యవాదాలు skvramesh గారు..

      Delete
  6. వర్మ గారు శీర్షిక అద్భుతంగా ఉంది అంత కన్నా అద్భుతంగా ఉంది మీ కవిత..:-)

    ReplyDelete
  7. విరహపు విషాదం మనసను కలిచివేసింది

    ReplyDelete
  8. చక్కని కవిత,అభినందనలు అందుకోండి మీరు.

    ReplyDelete
    Replies
    1. ఎన్నాళ్ళకు మీ అభినందనలు...థాంక్యూ భాస్కర్జీ...

      Delete
  9. "దేహమంతా పూసుకున్న నీ ఊహల పరిమళంతో
    నేను...

    ఒక్క మాట కూడా రాని మౌన ప్రమాణంతో
    నీవు..."......... దేహమంతా ఊహల పరిమళం, మౌన ప్రమాణం... భావవ్యక్తీకరణ చాలా చాలా బాగుంది వర్మగారు.. కవిత చాలా నచ్చేసింది నాకు.

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు శోభా మేడం..

      Delete
  10. ఎలా ఉన్నావు

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...