Thursday, August 16, 2012

ఆటోగ్రాఫ్...


వడిగా విడిపోతున్న వలయాల మధ్య
ఓ కిరణంలా దూసుకుపోతూ నువ్వు....

ఒక్కో సంకెలా తెగిపడుతున్న వేళ
ఓ గజ్జెల మోతలా తాండవిస్తూ నువ్వు....

రెప రెపలాడుతున్న జెండా గుడ్డలా
ఒకే రంగులో అలరిస్తూ నువ్వు....

రహస్యాలన్నీ ఉల్లిపొరలా వీడిపోతున్నప్పుడు
డప్పుల మోతలా మోగుతూ నువ్వు....

అచ్చెరభ శరభా అంటూ ఊరేగింపు సాగుతున్న వేళ
చంద్రప్రభలా ప్రభవిస్తూ నువ్వు....

యిన్ని దీపకాంతుల వరుసల మధ్యగా
ఓ తారాజువ్వలా మండుతూ వెలుగుజిమ్ముతూ నువ్వు.....

ఆశయాల అరచేతుల కలయికలో
గట్టిగా బిగించిన పిడికిలిలా నువ్వూ నేను.....

చివరి చిరునవ్వు సంతకంతో
నీవందించిన ఆటోగ్రాఫ్ చెరగని ముద్రతో నేనిలా....

17 comments:

  1. ఆశయాల అరచేతుల కలయికలో
    గట్టిగా బిగించిన పిడికిలిలా నువ్వూ నేను.....


    ReplyDelete
  2. మీ పదాల్లో ఇమిడిన ఆ "నువ్వు" చేసుకున్న భాగ్యమే కదా ఈ కవిత:-)





    ReplyDelete
    Replies
    1. ఆ 'నువ్వు' కల్పించిన అదృష్టమే కదా ఈ పదాల పొందిక...

      థాంక్యూ పద్మార్పిత గారూ..

      Delete
  3. sir kavitha koncham confusion gaa undi . bhaasha baagundi.

    ReplyDelete
    Replies
    1. Fathimaji...మీ మాట స్వీకరిస్తున్నా...థాంక్యూ...

      Delete
  4. Replies
    1. తప్పకుండా...మీకిచ్చే వెళ్తా అనికేత్...:-) thanks for your kind compliment...

      Delete
  5. ఆటోగ్రాఫ్ లో మీ ఇద్దర్ని చూసానులెండి:)

    ReplyDelete
    Replies
    1. ప్రేరణ గారూ మరింకేం ఓ ఫోటో తీయండి..-) థాంక్యూ ఫర్ యువర్ లవ్లీ కామెంట్..

      Delete
  6. అద్భుతం సార్

    ReplyDelete
  7. hrudayaniki chala daggaraga anipinchindi varma ji :-) awesome composition....

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...