Wednesday, May 23, 2012

ఎప్పుడైనా నిన్ను నువ్వు...

ఎప్పుడైనా నిన్ను నువ్వు
వడిసెల రాయిని చేసి
విసిరి చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
కాగితప్పడవను చేసి
వాన నీటిలో ఈది చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
కాగితపు రాకెట్ గా చేసి
విసిరి చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
గాలిపటానికి తోకగా మార్చి
దారపు చివరంటా ఎగిరి చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
గులకరాయిని చేసి
నీటిలో కప్పగంతులేసి చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
రంగునీళ్ళగా మార్చి
హోళీ ఆడి చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
సీతాకోక చిలుక రెక్కపై
రంగు పొడిలా అంటుకొని చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
రిబ్బను ముక్కగా మార్చి
జడకుచ్చుగా చూసుకున్నావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
వరికంకుగా చేసి
పిచ్చుక నోటికందించి చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
నాగలి కర్రుగా మార్చి
మట్టిగుండెలో్ చాళ్ళుగా మారి చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
సమ్మెటగా మార్చి
ఎర్రగా కాలిన ఇనుప కమ్మిపై పడి చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
డప్పుపై చర్మంగా మార్చి
నకజనకరి నాం దరువై చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
కాలి గజ్జెలో మువ్వగా మార్చి
థింసా పాదం ఆడి చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
ఓ తూటాగా మార్చి
వాడి గుండెల్లో దూసుకుపోయి చూసావా??

12 comments:

  1. ఎప్పటికీ మీరిలాగే
    మనస్సుకి హత్తుకునే కవితలు రాస్తూ
    ఉండిపోవాలనుకుంటునారా?

    (ఉండిపోవాలని కోరుకుంటూ ....) చాలా బాగుంది!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు జలతారువెన్నెలగారూ..మీ ఆత్మీయ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ..

      Delete
  2. చాలా చాలా బాగుంది.heart touching...

    ReplyDelete
  3. తూటాలతో పని ఏల వర్మగారు?
    గుండెల్లోకి దూసుకుపోయారుగా:-)
    ఇలా మనసుకు హత్తునేలా వ్రాసి!

    ReplyDelete
    Replies
    1. కొన్ని పనులు వాటితో కూడా చేయాల్సుంటుంది కదా పద్మాజీ...:-)
      మీ ఆత్మీయ స్పందనతో గాలిలో తేలిపోతున్నా...థాంక్యూ వెరీ మచ్...

      Delete
  4. వర్మ గారూ , ఎప్పుడైనా కవిగా మిమ్ము మీరు చూసుకున్నారా ? అయ్యో చూసుకోలేదా , మేము చూస్తున్నాం కదా , సార్, ఎప్పుడైనా నిన్ను నీవు మనిషిగా చూసుకున్నావా ? అని ప్రతి మనిషినీ అడిగినట్లుంది మీ కవిత అధ్బుతంగా రాస్తారు వర్మాజీ

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలండీ..

      Delete
  5. చాలా రోజులకి ఇలా వచ్చి చూసాను
    బాగుందండి మీ కవితాంతరంగం.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...