Saturday, November 24, 2012

దీప కాంతి..


నువ్వొక్క పరిచయానివేనా?
నువ్వొక్క పలకరింపువేనా??

అలా వచ్చి ఇలా వెల్లిపోయే
ఉదయపు వాన తుంపరవా?

అలా మెరిసి ఇలా మాయమయ్యే
మెరుపు విల్లువా?

అలా గాలిని కోస్తూ సుదూరాన
వినపడే వెదురు గానానివా?

అలా చల్లగా మేనును తాకి
యిలా మరలిపొయె సమీరానివా?

కాదు నేస్తం!
కలలా కరిగిపొయే కాలానివి కాదు...


నా ఎద ప్రమిదలో నిత్యం వెలిగే
దీప కాంతివి నీవు...

(నా ఎదను తట్టిలేపిన ఓ మైత్రి బంధానికి ఏడాది పూర్తయిన వేళ ఈ అక్షర మాల)

9 comments:

  1. మీ హృదయపు దీపకాంతి మరంత కాంతివంతంగా వెలగాలని ఆశిస్తూ..

    ReplyDelete
  2. దీప కాంతి లో మీ అక్షరమాల బాగుంది...
    మీ మైత్రీ బంధం మరిన్ని కాలాలు విరాజిల్లాలని కోరుకుంటూ...
    అభినందనలు!

    ReplyDelete
  3. వర్మ గారూ, దీపకాంతికి ఎన్ని కిరణాలో ..అన్నింటా మైత్రి వెదజల్లాలి.
    మీ స్నేహం కలకాలం సవ్యంగా ఉండాలి మీ కవితలా....మెరాజ్

    ReplyDelete
  4. కమురు వాసన వేస్తుందేమో మీ హృదయం ....అయ్యో ఎలా ?

    ReplyDelete
  5. మీ మైత్రిలో దీపకాంతి దేదీప్యమానంగా వెలగాలి....
    స్నేహపూరిత చమురు మీ ఇరువురిలో పెరగాలి....

    ReplyDelete
  6. light of your friendship brighten up forever.

    ReplyDelete
  7. తమ ఆత్మీయ స్పందనలతో మా స్నేహాన్ని దీవించిన మిత్రులందరికీ ధన్యవాదాలు...

    ReplyDelete
  8. అలా దీపకాంతి అయి మీ హృదయంలో ఉండి మీకే సొంతం కావాలనుకోవడం స్వార్థమేమో వర్మగారు:)

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...