Monday, November 19, 2012

రా రా రష్యా రా రా..

రష్యా రష్యా రష్యా

అవును చాలా కాలమైంది నీ పేరు విని
ఎందుకో నువ్వో మాసిపోయిన జ్ఞాపకం  కాదని
నీ పేరు వింటే యిప్పటికీ నాలో అదే ఉద్వేగం...ఉత్తేజం...


సోవియట్ రిపబ్లిక్!
తలెత్తి చూస్తే ఓ అరుణ పతాక రెపరెపలు...

ధరిత్రి నిండా అరుణార్ణవం...

గుండెనిండా నిబ్బరం
పాదాలు నేలకు గట్టిగా ఆనుకొని నిలబడే నిబ్బరత్వం...

అటూ ఇటూ లక్షలాది చేతుల మానవ హారం నా చుట్టూ వున్నట్టు...

నిన్నొక మాయ పొర కమ్మి మాకు
దూరమయ్యావన్న బాధ...

కానీ నువ్వెప్పుడూ ఓడి పోని బోల్షివిక్ వే
నీ కలష్నికోవ్ ఎప్పుడు గర్జిస్తూనే వుంటుంది...

నువ్వొక ఆదర్శం
నువ్వొక ఆశయం
నువ్వొక స్వప్నం

నువ్వొక అమర వీరుని చిరునవ్వువి
నువ్వొక గోగు పూవు ఎరుపుదనానివి
నువ్వొక మందుపాతరలోని రజానివి...

రాజుకుంటూనే వుంటావు
మరల మరల నీ పేరు తలుస్తూనే వుంటాం...

సమ సమాజ నిర్మాణ పునాదికి
నువ్వొక ఊపిరిలూదే ఉత్ప్రేరకానివి...

రా రా రష్యా రా రా...
మరల మరల ఈ పల్లెలోకి పట్నంలోకి అడవిలోకి కొండ కోనల్లోకి నదీ నదాలు సముద్రాంతర్భాగంలోకి..

నువ్వొక తీరని దాహం
నువ్వొక తీరని మోహం...

ఉప్పెనలా ఉరుములా మెరుపులా
రా రా రష్యా రా రా...

(అక్టోబర్ సోవియట్ రష్యా విప్లవానికి జేజేలు పలుకుతూ...)

3 comments:

  1. Varmagaaroo.. adugadugunaa araachakam, anyaayam nindukunna chotiki samaanatwa paalana raadu pilichinaa raadu.

    ReplyDelete
    Replies
    1. ఫాతిమాజీ అరాచకం అన్యాయం వున్న చోటనే ఉద్యమాలు వస్తాయి వాటిని రూపు మాపేందుకు.. మార్పు సహజంగా జరుగుతునె వుంటుంది.. నిరాశవద్ధు.. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు..

      Delete
  2. రా రమ్మంటూ పిలిస్తే రాళ్ళు రువ్వజూస్తారే కాని మార్పు కష్టమేనండి! అయినా ఆశిద్దాం.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...