అవును
ఒక్కోటి
అలా విడిచి వెళ్ళాలనుంటుంది...
మూసిన ద్వారాలన్నీ
ఒక్కోటి
అలా విడిచి వెళ్ళాలనుంటుంది...
మూసిన ద్వారాలన్నీ
భళ్ళున తెరుస్తూ....
గానుగెద్దులా కళ్ళకు గంతలు కట్టుకొని
ఈ నూనె బావి చుట్టూ తిరుగుతూ
ఇదే జీవితమంటూ నిలబడేకంటే...
ఎవడన్నాడు
ఇది బాధ్యతా రాహిత్యమని??
ఎవరికి వారే ఒక గాలిపటంలా
ఎగరాల్సిన చోట
అంతా తోక కత్తిరించినట్టు
ఎటూ ఎగరలేనితనంతో...
తరగని దూర తీరాల వెంబడి
ఇసుక తిన్నెల మూపురాలను కూలుస్తూ...
గుండె నిండా
స్వేచ్చా గాలులు శ్వాశిస్తూ...
చెలమ ఊటల దోసిలి పడుతూ
దాహం తీరా ఆస్వాదిస్తూ....
గొంతెత్తి దిగ్ధిగంతాలను ఏకం చేస్తూ
నాభిని చీల్చుకుంటూ వచ్చే
ఆదిమ రాగాన్ని ఆలాపిస్తూ....
దాగి వున్న
అనేకాలను ఏకంచేస్తూ
ధవళ వర్ణ కాంతులను
విరజిమ్ముతూ...
నింగి నుండి
ఉల్కలా భగ బగ మండుతూ...
ఒక్క క్షణం
ఒకే ఒక్క క్షణమైనా జీవించనీ....
గానుగెద్దులా కళ్ళకు గంతలు కట్టుకొని
ఈ నూనె బావి చుట్టూ తిరుగుతూ
ఇదే జీవితమంటూ నిలబడేకంటే...
ఎవడన్నాడు
ఇది బాధ్యతా రాహిత్యమని??
ఎవరికి వారే ఒక గాలిపటంలా
ఎగరాల్సిన చోట
అంతా తోక కత్తిరించినట్టు
ఎటూ ఎగరలేనితనంతో...
తరగని దూర తీరాల వెంబడి
ఇసుక తిన్నెల మూపురాలను కూలుస్తూ...
గుండె నిండా
స్వేచ్చా గాలులు శ్వాశిస్తూ...
చెలమ ఊటల దోసిలి పడుతూ
దాహం తీరా ఆస్వాదిస్తూ....
గొంతెత్తి దిగ్ధిగంతాలను ఏకం చేస్తూ
నాభిని చీల్చుకుంటూ వచ్చే
ఆదిమ రాగాన్ని ఆలాపిస్తూ....
దాగి వున్న
అనేకాలను ఏకంచేస్తూ
ధవళ వర్ణ కాంతులను
విరజిమ్ముతూ...
నింగి నుండి
ఉల్కలా భగ బగ మండుతూ...
ఒక్క క్షణం
ఒకే ఒక్క క్షణమైనా జీవించనీ....
nijam gaane chaalaa baavundi
ReplyDeleteథాంక్సండీ మంజు గారు...
Deletepaata kudaa chaalaa baagundi
ReplyDeleteథాంక్సండీ...
DeleteNice One sir!!
ReplyDeleteథాంక్యూ సుభ గారు...
Delete"చెలమ ఊటల దోసిలి పడుతూ
ReplyDeleteదాహం తీరా ఆస్వాదిస్తూ....
గొంతెత్తి దిగ్ధిగంతాలను ఏకం చేస్తూ
నాభిని చీల్చుకుంటూ వచ్చే
ఆదిమ రాగాన్ని ఆలాపిస్తూ...."
ఇలా రాయాలని నా అత్యాశ కాబోలు....
మీది అత్యాశ కాదండీ..
Deleteమీరింకా బాగా రాస్తున్నారు పద్మార్పిత గారు...
మీ స్ఫూర్తిదాయక స్పందనకు అభివందనాలు...
Okka kshanaanni chaaalaa chakkagaa chepparu varma garu.
ReplyDeleteధన్యవాదాలు ఫాతిమాజీ...
Deleteఅలా ఒక్కక్షణమైనా జీవించనీ....సూపరండి
ReplyDeleteThanksandi Yohanth garu..
Deleteఏంటో బావ్..
ReplyDeleteనాకొక్క ముక్క అర్థం కాలే..
కానీ ఒక్కక్షణమేంటి లక్ష క్షణాలు బతకండీ...
అవునా..
Deleteమీకు అర్థమయ్యేలా వ్రాయడానికి ప్రయత్నిస్తాలెండి...థాంక్యూ..
ఒక్కో క్షణం ఆనందంగా బ్రతికేయండి:-)
ReplyDeleteమీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ ప్రేరణ గారు...
Delete
ReplyDeleteదాగి వున్న
అనేకాలను ఏకంచేస్తూ
ధవళ వర్ణ కాంతులను
విరజిమ్ముతూ...
నింగి నుండి
ఉల్కలా భగ బగ మండుతూ>>>
ఇది ఐతే ఎన్ని సార్లు చదివానో !! చాల బాగా రాసారు
మీ అక్షరాభిమానానికి అభివందనాలు maromahaprasthanam..
Delete