Thursday, November 8, 2012

ఒక్క క్షణం...

అవును
ఒక్కోటి
అలా విడిచి వెళ్ళాలనుంటుంది...

మూసిన ద్వారాలన్నీ
భళ్ళున తెరుస్తూ....

గానుగెద్దులా కళ్ళకు గంతలు కట్టుకొని
ఈ నూనె బావి చుట్టూ తిరుగుతూ
ఇదే జీవితమంటూ నిలబడేకంటే...

ఎవడన్నాడు
ఇది బాధ్యతా రాహిత్యమని??

ఎవరికి వారే ఒక గాలిపటంలా
ఎగరాల్సిన చోట
అంతా తోక కత్తిరించినట్టు
ఎటూ ఎగరలేనితనంతో...

తరగని దూర తీరాల వెంబడి
ఇసుక తిన్నెల మూపురాలను కూలుస్తూ...

గుండె నిండా
స్వేచ్చా గాలులు శ్వాశిస్తూ...

చెలమ ఊటల దోసిలి పడుతూ
దాహం తీరా ఆస్వాదిస్తూ....

గొంతెత్తి దిగ్ధిగంతాలను ఏకం చేస్తూ
నాభిని చీల్చుకుంటూ వచ్చే
ఆదిమ రాగాన్ని ఆలాపిస్తూ....

దాగి వున్న
అనేకాలను ఏకంచేస్తూ
ధవళ వర్ణ కాంతులను
విరజిమ్ముతూ...

నింగి నుండి
ఉల్కలా భగ బగ మండుతూ...

ఒక్క క్షణం
ఒకే ఒక్క క్షణమైనా జీవించనీ....

18 comments:

  1. "చెలమ ఊటల దోసిలి పడుతూ
    దాహం తీరా ఆస్వాదిస్తూ....
    గొంతెత్తి దిగ్ధిగంతాలను ఏకం చేస్తూ
    నాభిని చీల్చుకుంటూ వచ్చే
    ఆదిమ రాగాన్ని ఆలాపిస్తూ...."
    ఇలా రాయాలని నా అత్యాశ కాబోలు....

    ReplyDelete
    Replies
    1. మీది అత్యాశ కాదండీ..
      మీరింకా బాగా రాస్తున్నారు పద్మార్పిత గారు...
      మీ స్ఫూర్తిదాయక స్పందనకు అభివందనాలు...

      Delete
  2. Okka kshanaanni chaaalaa chakkagaa chepparu varma garu.

    ReplyDelete
  3. అలా ఒక్కక్షణమైనా జీవించనీ....సూపరండి

    ReplyDelete
  4. ఏంటో బావ్..
    నాకొక్క ముక్క అర్థం కాలే..
    కానీ ఒక్కక్షణమేంటి లక్ష క్షణాలు బతకండీ...

    ReplyDelete
    Replies
    1. అవునా..
      మీకు అర్థమయ్యేలా వ్రాయడానికి ప్రయత్నిస్తాలెండి...థాంక్యూ..

      Delete
  5. ఒక్కో క్షణం ఆనందంగా బ్రతికేయండి:-)

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ ప్రేరణ గారు...

      Delete

  6. దాగి వున్న
    అనేకాలను ఏకంచేస్తూ
    ధవళ వర్ణ కాంతులను
    విరజిమ్ముతూ...

    నింగి నుండి
    ఉల్కలా భగ బగ మండుతూ>>>
    ఇది ఐతే ఎన్ని సార్లు చదివానో !! చాల బాగా రాసారు

    ReplyDelete
    Replies
    1. మీ అక్షరాభిమానానికి అభివందనాలు maromahaprasthanam..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...