దేహాత్మలను దహించే అగ్ని
నీ కళ్ళలో వుందని ఇప్పుడే తెలిసింది
కాస్తా ఆరకుండా అలా జ్వలించనీ...
కాస్తా ఆరకుండా అలా జ్వలించనీ...
ఎగసి పడే ఆ నిప్పు రేకల చివర
అలా నిలిచి నిలిచి దహించి పోనీ...
అలా నిలిచి నిలిచి దహించి పోనీ...
మాటల నివురు కఫన్ కప్పుకోకుండా
ఈ ఏడు పొరలు దాటి లోలోన
ఆపాద మస్తకం దహించి పోనీ...
ఈ ఏడు పొరలు దాటి లోలోన
ఆపాద మస్తకం దహించి పోనీ...
కరువుదీరా ఈ కమురు వాసనను
శ్వాసించనీ...
పరిమళమేదీ అంటక మండుతున్న
నిప్పు నాళిక చివర దహించి పోనీ...
మనసు ఐమూలలన్నీ మంటలలముకొని
యుగాల మసిబారినతనాన్ని ధహించనీ...
రాజుకున్న దేహపు కాష్టం
కదలబారకుండా దహించనీ....
శ్వాసించనీ...
పరిమళమేదీ అంటక మండుతున్న
నిప్పు నాళిక చివర దహించి పోనీ...
మనసు ఐమూలలన్నీ మంటలలముకొని
యుగాల మసిబారినతనాన్ని ధహించనీ...
రాజుకున్న దేహపు కాష్టం
కదలబారకుండా దహించనీ....
అలా దహించుకుపోతే ఇంకేముంటుందండి! ఇది విరహమా? లేక వేదనయా?:-)
ReplyDeleteవేదన ఆవేదన ఆక్రందనల సమ్మిళితం ప్రేరణ గారు...
Deleteమీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు
వర్మ గారూ,
ReplyDeleteమీ కవితలో అంతర్వేదన కనిపిస్తుంది.. అక్షరాలతో భావాలను ఆవిష్కరిచటం మీ కాలానికి బాగా తెలుసు.
ధన్యవాదాలు ఫాతిమాజీ మీ ఫిశ్లేషణాత్మక స్పందనకు..
Deleteఅబ్బా! ఆసాంతం నిప్పుల కొలిమి.
ReplyDeleteసారీ సుభ గారు..
Deleteనాకు ఓ అద్భుతమైన ప్రేమ కావ్యం లా కనిపిస్తుంది ......
ReplyDeleteథాంక్యూ ప్రియ కారుమంచి గారు...
Deleteపదాలపై పట్టుతో ఒకో మెట్టులో కొత్తదనాన్ని చూపిస్తూ మీ భావాగ్నిలో మమ్మల్ని దహించేలా చేస్తూ....ఇలా అనడమేంటో:-)
ReplyDeleteమీ అక్షరాభిమానంతో స్పందిస్తూ సహానుభూతిని తెలియ చేసినందుకు ధన్యవాదాలు పద్మార్పిత గారు...
DeleteThis is the way you are mesmerizing the people sir:)
ReplyDeleteNot mesmerising Aniketh..
Deletejust putting my feel on the wall not to share but sink with u...:-)
Thanks for your kind compliment...