ఎక్కడో ఒక మలుపు దగ్గర
ఆగిపోవడమేనా??
మొదలుపెట్టిన గీత అలా
ఓ అసంపూర్ణ రేఖా చిత్రంగా!
కుంచెనంటిన రంగు చివరంటా
అలా ఆరిపోతూ!!
గొంతుపెగలని రాగమేదో
సుళ్ళు తిరుగుతూ లోలోపల!!
హృదయంలో అలంకరించిన
చిత్రం పగిలిన అద్దంలో!!
పొగ మారిన నా ప్రతిబింబం
నీ కన్నీటి చుక్కలో ఒలికిపోతూ!!
ReplyDeleteఎక్కడో ఒక మలుపు దగ్గర
ఆగిపోవడమేనా?? తప్పదు మరి
అంతేనంటారా??
Deleteథాంక్యూ స్వామి గారు..బ్లాగు సందర్శించి స్పందించినందుకు..
అంతేకద మరి కుదరనప్పుడు అలాగే అర్ధాంతరంగా ఆగిపోవడమే.
ReplyDeleteఅవునా అనికేత్..
Deleteకుదరడం కుదరకపోవడం మన చేతుల్లోనే వుంటుంది కదా!
అలా ఆగకుండా సాగితేనే జీవన సాఫల్యం కదా!!
మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు..
ఏదైనా సాగగలిగినంతవరకే సాగుతుందేమో వర్మగారు
ReplyDeleteమలుపుల్లో కూడా సాఫీగా సాగాలనుకోవడం అవివేకమేమో!
నాకు తోచింది ఇలా చెప్పాను తప్పుగా అనుకోకండి.
మలుపులు గతుకులు లేని జీవన పయనం వుంటుందా??
Deleteసాఫీగా సాగినంతవరకే అనుకుంటే జీవితం సంపూర్ణమవుతుందా??
ఒడిదుడుకులను అధిగమించి ప్రయాణం సాగిస్తేనే కదా స్నేహానికి నిజమైన రూపమిచ్చినట్టు పద్మార్పిత గారు??
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు..
మీ బ్లాగు సముదాయంలో చేర్చండి...
ReplyDeleteపొగ మారిన నా ప్రతిబింబం
ReplyDeleteనీ కన్నీటి చుక్కలో ఒలికిపోతూ!!
.....మంచి ఫీల్ తో చక్కగా రాశారండి..
ధన్యవాదాలు భాస్కర్జీ...
Deleteమంచి ఫీలుంటుందండి మీ ప్రతి అక్షరంలో, చదివిందే చదవాలనిపిస్తుంది.
ReplyDeleteYohanth గారు..మీ మాట స్ఫూరినిస్తోంది...ధన్యవాదాలు...
Deletesubha/సభ గారు ధన్యవాదాలు..మీకు కూడా దీపావళీ శుభాకాంక్షలండీ..
ReplyDeleteVarma gaaroo, yedi evari kosam eppudoo aagadu, alaa aagipote, srusti ledu, lokam andhakaaram ayyedi.. gelupu otamilu, velugu chookati sahajame.. mee kavitha manchi bhaavamto saagindi..
ReplyDeletethank you Fathimaji...
ReplyDeletenice... back ground music very nice
ReplyDeleteThank you తెలుగు వారి బ్లాగులు గారు..
Delete