Tuesday, November 6, 2012

తత్వమసి..

  నీతో మాటాడుతున్న
సమయమంతా
నా హృదయం
సున్నితత్వాన్ని
పొందుతోంది...

ఏమైనా
నీవు నాలో
ప్రవహించే
జీవనదివి...

దేహంలోని
ప్రతి పాయా
నీ ప్రవాహంతో
పునీతమవుతూ
ఉత్తేజితమవుతోంది...


నదినిలా
నాలో యింకనీ
ఇగనీ...


మరల మరల
వర్షిస్తూ
చిగురు తొడగనీ..

18 comments:

  1. Mithramaa! Intha Abstractgaa raasthe naakartham kaaledu. Thaththvamasi ante adi neeve ai vunnaavu ani artham anukuntaa.. Naa agnaanni manninchu.

    ReplyDelete
    Replies
    1. సద్గుణ గారు మీరు చెప్పిన అర్థం సత్యమే..
      జీవితమే అబ్ స్ట్రాక్ట్ గా వున్నప్పుడు భావం దానిని దాటి పోలేదు కదా..
      మీలాంటి వారు మన్నించమనేంత గొప్పవాణ్ణేం కాదు..మిత్రమా అంటూ అలా అనడం బాధగా వుంది..

      Delete
  2. ఒక మనసు మరో మనసుకు జీవంపోసే మమైకత్వ కవితకు జోహారు.

    ReplyDelete
    Replies
    1. మమైకమైన భావాన్ని గుర్తించి ఆత్మీయ స్పందనను తెలియజేసినందుకు సదా కృతజ్నున్ని..

      Delete
  3. Replies
    1. ధన్యవాదాలండీ మంజు గారూ...

      Delete
  4. అంత సున్నితమైన మనసు కవితకు ఆ బీటలువారిన బొమ్మ కాస్త ఇబ్బందిగా ఉందండి వర్మగారు...క్షమించాలి!

    ReplyDelete
    Replies
    1. సున్నితత్వాన్ని పొందుతూన్న అనుభూతిని తెలియజెప్పే ప్రయత్నం ఆ చిత్రంలో అగుపించి వుంచాను సృజన గారు..మీ ఇబ్బందిని తెలియజేసినందుకు ధన్యవాదాలు...
      స్నేహం మధ్య సారీలు పంటికింద రాయిలా వుంటాయి కదా..:-)

      Delete
  5. వర్మగారు మట్టికి మొక్కకు ఉన్న అనుబంధాన్ని అద్భుతంగా చెప్పారు అంతే అద్భుతంగా చిత్రం కూడా really wonderful sir

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు వీణా లహరి గారు...

      Delete
  6. Replies
    1. ధన్యవాదాలు పూర్వ ఫల్గుణి గారు..

      Delete
  7. Replies
    1. ధన్యవాదాలు కావ్యాంజలి గారు..

      Delete
  8. తత్వమసి....అనే పదం ఉందని దాని అర్ధం అదనీ మీ కవిత ద్వారనే తెలిసిందండి.
    మీరు మాహా గొప్ప...............
    ఏదైనా ఒక క్రొత్త పదం పెట్టండి సార్:)

    ReplyDelete
    Replies
    1. అనికేత్జీ...
      నేనేం గొప్ప?????
      కొత్త పదం పెట్టేంత భాషా పరిజ్నానం లేదండీ...
      ఏదో అలా నెమరువేసుకోవడమే...:)

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...