Thursday, November 22, 2012

నిప్పు రేఖలు...

 దేహాత్మలను దహించే అగ్ని 
నీ కళ్ళలో వుందని ఇప్పుడే తెలిసింది
కాస్తా ఆరకుండా అలా జ్వలించనీ...

ఎగసి పడే ఆ నిప్పు రేకల చివర
అలా నిలిచి నిలిచి దహించి పోనీ...

మాటల నివురు కఫన్ కప్పుకోకుండా
ఈ ఏడు పొరలు దాటి లోలోన
ఆపాద మస్తకం దహించి పోనీ...

కరువుదీరా ఈ కమురు వాసనను
శ్వాసించనీ...


పరిమళమేదీ అంటక మండుతున్న
నిప్పు నాళిక చివర దహించి పోనీ...


మనసు ఐమూలలన్నీ మంటలలముకొని
యుగాల మసిబారినతనాన్ని ధహించనీ...


రాజుకున్న దేహపు కాష్టం
కదలబారకుండా దహించనీ....

12 comments:

  1. అలా దహించుకుపోతే ఇంకేముంటుందండి! ఇది విరహమా? లేక వేదనయా?:-)

    ReplyDelete
    Replies
    1. వేదన ఆవేదన ఆక్రందనల సమ్మిళితం ప్రేరణ గారు...
      మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు

      Delete
  2. వర్మ గారూ,
    మీ కవితలో అంతర్వేదన కనిపిస్తుంది.. అక్షరాలతో భావాలను ఆవిష్కరిచటం మీ కాలానికి బాగా తెలుసు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ఫాతిమాజీ మీ ఫిశ్లేషణాత్మక స్పందనకు..

      Delete
  3. అబ్బా! ఆసాంతం నిప్పుల కొలిమి.

    ReplyDelete
  4. నాకు ఓ అద్భుతమైన ప్రేమ కావ్యం లా కనిపిస్తుంది ......

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ ప్రియ కారుమంచి గారు...

      Delete
  5. పదాలపై పట్టుతో ఒకో మెట్టులో కొత్తదనాన్ని చూపిస్తూ మీ భావాగ్నిలో మమ్మల్ని దహించేలా చేస్తూ....ఇలా అనడమేంటో:-)

    ReplyDelete
    Replies
    1. మీ అక్షరాభిమానంతో స్పందిస్తూ సహానుభూతిని తెలియ చేసినందుకు ధన్యవాదాలు పద్మార్పిత గారు...

      Delete
  6. Replies
    1. Not mesmerising Aniketh..
      just putting my feel on the wall not to share but sink with u...:-)
      Thanks for your kind compliment...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...