Saturday, November 17, 2012

ఇనుపతనం..

 అలా కాలం మంచు పట్టి
గడ్డకట్టి పలకలా మారి...

ఏదో శాపానికి గురైనట్టు
ఆవహించిన ఇనుపతనం...

ఒకరికొకరు ఒదిగి
ఒడిసిపట్టుకున్నా కరగనితనం...

రాజుకున్న రాక్షసి బొగ్గు
నివురు గప్పి తెల్లబోయినట్టు...

ఆకు సవ్వడి లేక
ఆగిన గాలి కెరటం...

చవితి చంద్రునిలా
వెన్నెల మసకబారి...

గురుతులన్నీ నెమలీకకంటిన
బియ్యపు గింజలా...

గుండె బరువును భుజం
మార్చుకునే చెలిమి కోసం...

14 comments:

  1. ఇనుపతనాన్ని కూడా మీ సున్నితమైన పదాలతో మెత్తబరిచారు కదా వర్మగారు

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు పద్మార్పితగారు..

      Delete
  2. Replies
    1. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు మంజుగారు..

      Delete
  3. "గుండె బరువును భుజం
    మార్చుకునే చెలిమి కోసం"
    అందమైన పద ప్రయోగం.

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చి మెచ్చినందుకు ధన్యవాదాలు సృజన గారు...

      Delete
  4. మీ ఫీల్ చాలా బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు థాంక్సండీ తెలుగమ్మాయి గారు...

      Delete
  5. Varmagaaroo.., mee kavithalo maatram manishitanam, maanavatwam kanipistoo untundi. baagaa raasaaru.

    ReplyDelete
  6. వర్మగారు మీ కవితలో ఎక్కడా ఇనుపతనం కనపడందే:)...అంతా సున్నితనమే!

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...