Wednesday, March 21, 2012

ఆమెతో నేను...



నీ భావాల పుష్పక విమానంలో పయనిస్తున్న
నేను ఈ లోకాన ఏకాకిగ యిలా ఒదిగివుండటాన్ని
నాకై నేను విధించుకున్న శిక్షకాక మరేమని
ప్రశ్నిస్తున్న అంతరంగం ఎదుట అపరాథిగా నిలబడి
నీ కోటి కాంతుల చూపుతో బంధ విముక్తిన్ని గావిస్తావని
ఈ శాపగ్రస్త శిలువపై నుండి విడివడని అరచేతులతో
ప్రార్థిస్తున్నానన్నది నీకు తెలిసినా
నీవున్న అచంచల స్థితినుండి గ్రహించినా
ఓ అందమైన అబద్ధంగా అద్దం ముందు
యిలా నన్ను నిలిపి వుంచావన్నది సత్యం కాదా...

గుడ్డులోంచి చిరు పక్షి బయటపడే
ఆనందమయ సందర్భంలాంటి వేకువ కోసం
నేను నిరంతరం ధ్యానిస్తున్నానన్నది
నీ కను రెప్పలకావల దాగివున్న కలల
వెలుగులో దృగ్గోచరమవుతూ
నీ హృదయ తంతృలాలపిస్తున్న
ఉదయ రాగ సంగీత ఝరిలో
వింటూ తొలగించలేని ముసుగులో...

నేస్తమయిన శుభ వేళనుండీ
నా మాటలో వినబడలేదా
నా గుండె నిజాయితీ....

రహస్య తంత్రుల గుండా
మన సంభాషణల మధ్య విస్తరిస్తున్న
సమ భావ దీప కాంతులు
పూయిస్తున్న ప్రేమ పుష్పాల పరిమళం
నీ సిగలో తురుముతూ
శ్వాసిస్తున్నానీ పరిమళం....

అనుమానపు మబ్బు తెరలు తొలగి
పున్నమి వెన్నెల కాంతులు పూచే క్షణం కోసం
ఆర్తిగా ఓ కన్నీటి చుక్క రాలుతూ..

13 comments:

  1. "గుడ్డులోంచి చిరు పక్షి బయటపడే
    ఆనందమయ సందర్భంలాంటి వేకువ కోసం" అద్భుతం సార్.

    ReplyDelete
  2. వర్మాజీ అభినందనలు. యీ క్రింది పదాలు ...అద్భుతం. గుడ్డులోంచి చిరు పక్షి బయటపడే
    ఆనందమయ సందర్భంలాంటి వేకువ" wonderful.(Kanakambaram)

    ReplyDelete
    Replies
    1. @కనకాంబరంః ధన్యవాదాలండీ..

      Delete
  3. చాలా బాగా రాసారు.నాకు నచింది.

    ReplyDelete
    Replies
    1. @జలతారువెన్నెలః నచ్చినందుకు థాంక్యూ మేడం...

      Delete
  4. chalaa bagundi rajaa ....very intense ans sensitive expression ee madhya prema kavithallo chalaa feel kanipistondi....love j

    ReplyDelete
  5. చిరుఆవేశంతో కూడిన అందమైన వ్యక్తీకరణ!చాలా బావుందండీ.మీకూ, మీ కుటుంబసభ్యులకూ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

    ReplyDelete
    Replies
    1. పరిమళం గారూ ధన్యవాదాలండీ...మీకు ఉగాది శుభాకాంక్షలు...

      Delete
  6. ఆర్తిగా ఓ కన్నీటి చుక్క రాలుతూ..

    ReplyDelete
  7. mee cheti nundi raale aa aksharalu konni ina erukuni dachesukovalani untundi :-)

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...