Sunday, March 4, 2012
ఊహల అలలపై
నీ ఊహల అలలపై పాలనురుగునై
నేను తేలియాడుతున్నా...
నీ మాటల వారధిగా కన్నీటి కడలిని
ఒంటి చేత్తో ఈదేస్తూన్నా...
నీ స్నేహ పరిమళంతో
నిండిన నా జగత్తును
అపురూపంగా సృష్టించుకున్నా...
నీ పలకరింపు కరవైన వేళ
పాతాళంలోకి నెట్టి వేయబడ్డట్టు
ఓ నిరామయ స్థితికి లోనవుతూ...
పో...రా అంటూ
నువ్వు ఆప్యాయంగా పలికిన
మాట నా తలపై అమ్మ చేయివేసి
నిమిరినట్టు కళ్ళలో సన్నని పొర...
మాటల యుద్ధం మద్యలో
ఓ అమృతపు జల్లులా
ఒరేయ్!
భద్రంరా.. అన్న మాట
నన్ను నిలబెడుతోంది నేస్తం...
పరాయితనం లేని మన మధ్య
ఏ అనుమానపు సుడిగాలీ సోకకూడదని
నా నిరంతర తృష్ణ....
Subscribe to:
Post Comments (Atom)
ఎంతో చక్కని వ్యక్తీకరణ! మీ మధ్య సుడిగాలే కాదు వడగాలి కూడా సోకదు!
ReplyDeleteరసజ్న గారూ మీ ఆప్త వాక్యానికి ధన్యవాదాలండీ..
ReplyDeletevarma garu,
ReplyDeletevuhala alala pai meeru viharistu marikonni animuthyaalu vedajallalani korukuntoo.....
Thank u Habib gaaru..
Deletevarma garu chala baga undi me kavitha
ReplyDeleteధన్యవాదాలు Meraj Fathimaji..
Delete