ట్రిగ్గర్
వాడు
అడవిలోలోపల చొరబడ్తున్నాడు...
అడవితల్లిని చెరబట్టజూస్తున్నాడు...
పుట్టకొకరిని చేసి ఏరివేయాలని
ముందుకు దూసుకు వస్తున్నాడు....
యుగాలుగా దాగిన మూలుగులను
పీల్చి పిప్పిచేయడానికి
వేగంగా వేగ వేగంగా జొరబడుతున్నాడు...
వడి వడిగా మరఫిరంగులు గురిపెడుతూ
ఆబగా ఆకాశంనుండి చూస్తూ
ఆకుపచ్చ చందమామను వేటాడచూస్తున్నాడు
చేతిలో శిలకోలకు పదును పెడుతూ
నేనిక్కడ ఆంబుష్ లో కూచున్నా...
కర కరమని ఆకు సవ్వడి చేస్తూ...
కిచ కిచమని కోతిపిల్ల వాడి రాకను చూపుతోంది....
ఇప్పుడు అమ్మ గురించి ఆలోచిస్తే
వాడు అమ్మ స్తన్యాన్నే అమ్మజూస్తున్న వాడు....
ట్రిగ్గర్ పై వేలుబిగుసుకుంది..........
"కర కరమని ఆకు సవ్వడి చేస్తూ...
ReplyDeleteకిచ కిచమని కోతిపిల్ల వాడి రాకను చూపుతోంది....
ఇప్పుడు అమ్మ గురించి ఆలోచిస్తే
వాడు అమ్మ స్తన్యాన్నే అమ్మజూస్తున్న వాడు...."
కట్టిపడేసారుగా:-) Fabulous!
మీ ఆత్మీయ స్పందనతో నిబ్బరాన్నిచ్చినందుకు ధన్యవాదాలు పద్మార్పితగారు...
ReplyDelete