ఎర్రగా కాలుతున్న రాయిపై
అరిపాదం బొబ్బలెక్కినా
ఆగని నడక...
మెత్తగా ముళ్ళు దిగుతూ
గాయం సలపరమెడుతున్నా
ఆగని నడక...
కసిగా ఇసుక కోస్తు
నెత్తురు చిమ్ముతున్నా
ఆగని నడక...
చల్లగా మంచు గడ్డపై
తిమ్మిర్లెక్కుతున్నా
ఆగని నడక...
జీవితం నడకైనప్పుడు
తోవ ఏదైనా
నడక ఆగదు కదా...
(తే 10-05-2013 దీ)
అంతే కదా? చాలా బాగుంది వర్మ గారు.
ReplyDeleteధన్యవాదాలు జలతారు వెన్నెల గారు..
Deleteజీవన సారం .. అద్భుతంగా చెప్పారు
ReplyDeleteథాంక్యు మహిది అలి గారు..
Deleteతప్పదేమో, మనసు కుదుటపడనంతవరకు, గమ్యం చేరేంతవరకు విశ్రాంతి లేని కఠోర నడక,..బాగుంది వర్మగారు,..
ReplyDeleteమీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు భాస్కర్జీ...
Deleteతప్పదు....జీవనపయనం
ReplyDeleteకాళ్ళు కాలినా...
బీటలుబారినా...
రక్తం కారినా...
పేరులోనే జీవన పయనం కలిగిన అనికెత్ కు వేరే చెప్పాలా.. :-)
Deletethank you Mr.Aniketh..
మనసు కి సంకెళ్ళు వీసిన ఆగని పయనం ...జీవిత గమ్యం వెతుకుతూ గాజు కళ్ళలో కలల ప్రయాణం .
ReplyDeletethank you Seleneji for your kind comment..
Delete