Monday, May 6, 2013

సందిగ్ధంతో...

నువ్వెప్పుడూ విడి విడిగానే కనబడతావు
నువ్వూ నేనులా

ఇసుక రేణువు విడి విడిగానే కనబడుతుంది
దేనికది స్పృహ లేనట్టుగా

నీటి తుంపర విడి విడిగానే ఎగసిపడుతుంది
వీడలేని బాంధవ్యంలా

కళ్ళు రెండూ విడి విడిగానే చూస్తాయి
ఒకే దృశ్యాన్నిలా

చెవులు రెందూ విడి విడిగానే వినిపిస్తాయి
ఒకే స్వరాన్ని ఏక తాళంలా

దేనికది విడివడుతూనే ముడి పడి
వున్నదన్నది ఎంత విషాదమూ...

12 comments:

  1. విషాదమంతా తొంగి చూస్తుంది.

    చిత్రం కూడా బావుంది వర్మ గారు.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు వనజవనమాలి గారు.

      Delete
  2. నువ్వెప్పుడూ విడి విడిగానే కనబడతావు నువ్వూ నేనులా... చాలా చాలా నచ్చింది. నా collection లో దాచుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. This is a great compliment to me.. Thanks a lot అనూ గారు..

      Delete
  3. విషాదంలో కూడా సందిగ్ధంతో అంటే ఎలాగండి....

    ReplyDelete
    Replies
    1. కొన్ని సమయాలలో అంతే కదండీ.. అలా ఉండబట్టే మీ వ్యాఖ్య పొందగలిగాను కదా.. థాంక్యూ పద్మార్పిత గారు..

      Delete
  4. భావం ఎంత బాగుందో!
    చిత్రం, కవిత రెండు మనసు దోచుకున్నాయి!

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానానికి ధన్యవాదాలు జలతారు వెన్నల గారు..

      Delete
  5. ఎటుచూసినా ఏముంది ఈ ఎండాకాలం అంతా విషాదం, విరహమే :)

    ReplyDelete
    Replies
    1. అంతేనంటావా అనికేత్..ః) థాంక్యూ..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...