Friday, May 31, 2013

యత్నం..


చేతులలోకి ఇంత మట్టిని తీసుకొని
తడినద్దుతూ ఓ బొమ్మ చేసే ప్రయత్నం...

పిడికిలిలోకి ఉలినందుకొని రాతినిలా
నిలబెడుతూ ఓ శిల్పం చెక్కే ప్రయత్నం...

ఇన్ని దారప్పోగులను వేళ్ళ మద్య
తీసుకుంటూ నేత నేసే ప్రయత్నం...

ఇన్నిన్ని రంగులను ఒంపుకొని
కుంచెతో చిత్రం గీసే ప్రయత్నం...

రాజుకున్న బొగ్గుల మద్య ఇనుప కడ్డీని
సమ్మెటతో మోదుతూ ఓ పనిముట్టు చేసే ప్రయత్నం...

మనసులోకి ఇన్ని తడి అక్షరాలను ఒంపుకొని
కాగితంపై కవిత చేద్దామని విఫల యత్నం,,,

6 comments:

  1. తడి అక్షరాలని...
    విఫలయత్నమని...
    అందమైన పదాలతో మనసులని కట్టిపడేసి...ఇలా యత్నం అంటారేం వర్మగారు :-)

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు పద్మార్పిత గారు.
      ఒక్కోసారి అలా విఫలమవుతూ వుంటా. చిత్రమో కవితో రూపుదిద్దుకోలేక.

      Delete
  2. మీ ప్రయత్నం విపలం కాదు సపలమే వరమ గారూ, మీ రచనలు నిజాయితీగా సమాజాన్ని సూటిగా ప్రశ్నిస్తుంటాయి .

    ReplyDelete
  3. ఈ యత్నం నాకు చాలా నచ్చిందండి.

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చిందన్నందుకు ధన్యవాదాలండీ Yohanthji..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...