ఎదను ప్రమిదను చేసి...
ఔనంటే కాదంటావు...
ఏమన్నా తప్పంటావు!
ఇంకేం చెప్పను??
ఎలా చెప్పను??
చీకటి నీడలో ఒంటరిని చేసిన
నెలవంక వెనకాల నడకనై..
కనురెప్పల వంతెనకింద
నల్ల రేఖనై కరిగిపోయా...
ప్రమిద క్రింద దాగిన నీడనై
నీ వెలుగు కొరకై....
ఉబికే కన్నీళ్ళను ఉగ్గబెట్టి
నెత్తురు చిమ్మిన ఎదను
ప్రమిదగా చేసి ఇలా మిగిలా....
నీ కంటి వెలుగుతో
వెలిగిస్తావో శపిస్తావో...
ఏమనను?
ఏమైపోను??
శపించేటంతటి సాహాసమా!!!!!
ReplyDeleteఎదనే ప్రమిదగా చేసిన మీపై:-)
థాంక్సండీ పద్మగారూ...శపించనందుకు...ః-)
ReplyDeleteయదనే ప్రమిద ని చేసిన మీ ప్రేమ కి జొహార్లు.
ReplyDeleteమీ జీవితాన్ని వెలిగిస్తుంది తను మీ యదలొని ప్రమిద ను చేరి....!!
సీతగారూ థాంక్సండీ..
DeleteLovely. బాగుంది
ReplyDeleteథాంక్యూ జలతారువెన్నెల గారూ..
Deleteకనురెప్పల వంతెనకింద
ReplyDeleteనల్ల రేఖనై కరిగిపోయా...అరె వహ్ ఏం చెప్పారండీ! అసలు శీర్షికే అదిరింది! బాగు బాగు!
మీరు నచ్చి మెచ్చినందుకు ధన్యవాదాలండీ రసజ్నగారూ...
ReplyDeletehttp://neelahamsa.blogspot.in/2012/03/blog-post_14.html
ReplyDelete