Sunday, March 11, 2012

ఆర్తి...




ఇప్పుడో చినుకు రాలితే బాగుండు!

ఎర్రగా కాలిన పెనంలాంటి
దేహంపై జిల్లుమంటూ...

ఇప్పుడో గాలి తిమ్మెర వీస్తే బాగుండు!
ఆరిపోతున్న
ప్రాణం లేచి వచ్చేట్టు....

ఇప్పుడో కోయిల కూస్తే బాగుండు!
రొద పెడుతున్న చెవులలో
తీయని గొంతులా...

ఇప్పుడో కరచాలనం కోసం ఆర్తిగా!
దేహమంత చేతులతో
ఎదురుచూపు...

ఇప్పుడో పలుకరింపు కోసం వెర్రిగా!
మనసున మంచుపూలు
పూచేలా...

6 comments:

  1. ట్రిగ్గర్ పట్టిన చేతుల్లో ఇంతటి ఆర్తి?????
    భావసంఘర్షణ, అంతఃసంఘర్షణగా మారి అక్షరరూపంగా అందరితో భిన్నంగా మీరే పంచగలరు......Great!

    ReplyDelete
  2. మీ అక్షరాత్మీయతకు ధన్యవాదాలు పద్మార్పితగారు...మీ కామెంటు మరింత స్ఫూర్తినిచ్చింది....

    ReplyDelete
  3. >>ఇప్పుడో కరచాలనం కోసం ఆర్తిగా!
    దేహమంత చేతులతో
    ఎదురుచూపు...>>
    చాలా బావుంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు జ్యోతక్కా...

      Delete
    2. వర్మగారూ నేను మీరనుకుంటున్న అక్కయ్యను కాదేమోనండీ..అలా అని మీ పిలుపును మార్చుకోనవసంలేదు..ఇలా బావుంది.

      Delete
    3. జ్యోతిర్మయి గారూ నేను మా విశాఖ జ్యోతక్క అనుకున్నా...తన పేరు ఇదే..అయినా మీరు బావుందన్నారు కాబట్టి నాకు మరో సోదరి లభించినందుకు ఆనందంగా వుంది..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...