Wednesday, January 18, 2012

నవ్వుల వెలుగు


కాలం దొంగిలించిన బాల్యాన్ని
మళ్ళీ గుర్తు చేసాడు వీడు...


తప్పిపోయిన హృదయాన్ని

మళ్ళీ పట్టిచ్చాడు వీడు....


గతమంతా గురుతులుగా

మాసిపోయిన నూనె మరకలా

మిగిలిన నలుపు తెలుపుల

ముఖ చిత్రంపై కాసింత వెన్నెలని

చిలకరించాడు వీడు....


ఏ కాలుష్యమూ అంటని

నవ్వులు విరజిమ్ముతూ
భోగీలో
కనుమ వేళ
దీపావళిని
వెలిగించాడు వీడు...

(నిన్న విజయనగరం రైలులో వెల్తూన్నప్పుడు ఈ బాబును చూసి యిలా...)

4 comments:

  1. భోగీలో భోగిని దీపావళిని సమ్మిళితం చేసి అసలు సిసలైన ఆనందం అంటే ఏంటో చూపించాడన్నమాట...

    ReplyDelete
  2. @వాసుదేవ్జీ మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు సార్..

    ReplyDelete
  3. kids are always GODS who show the beauty and real truth of life :-) wonderful lines varma ji:-)

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...