Tuesday, January 24, 2012

క్షమించు పాపా

 
 క్షమించు పాపా! 

నువ్వు కడుపులో వున్నావన్న
స్పృహే ఊపిరాడనీయదు....

చచ్చాక నరకం దాటిస్తాడన్న బుద్ధిలేనితనంతో
మగ బిడ్డకు వెంపర్లాడే వెఱితనంతో
నీ గొంతునులిమి తుప్పలో పారేసే మూర్ఖులం...

గొంతులో వడ్ల గింజ వేసి ఊపిరిదీసే హంతకులం...

మేమూ ఓ తల్లి కడుపులోనే పుడతామన్న
స్పృహలేని జీవశ్చవాలం....

అద్దెకు కడుపులు కొనుక్కుని మురిసిపోతున్న
వికృత జీవులం....

క్షమించేయి తల్లీ....

(నేడు జాతీయ ఆడబిడ్డల దినోత్సవం సంఘీభావంగా)

2 comments:

  1. ఏం చేసినా చిరునవ్వుతో క్షమించే మనసున్న మంచివాళ్ళం..:-)

    ReplyDelete
    Replies
    1. ఔను పద్మగారు క్షమయా ధరిత్రికి ప్రతిరూపం స్త్రీమూర్తి కదా...అందుకే మీకు వందనాలు....

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...