Saturday, January 21, 2012

నిశ్శబ్ధ సంగీతం..


ఇక్కడెవరో సన్నని తీగలను
నిశ్శబ్ధంగా మీటూతూ
రక్తజ్వలన సంగీతాన్ని ఆలపిస్తున్నారు...

ఒక్కో మెట్టులోనూ ఎగుడు దిగుళ్ళ
వంపులతో గుండెను చిలకబడ్తుంటే
దేహమంతా విద్యుత్ ప్రవహిస్తూ
తీవ్ర ప్రకంపనలతో కుదుపు....

కనులముందు కురుస్తున్న
ధారలో చూరంటిన జ్నాపకమొకటి
వేలాడుతూ నెత్తురోడుతూ
పచ్చిగా మిగిలి వున్నానన్న
బాలింతరపు వాసనేస్తూ....

6 comments:

 1. బాలి౦తరపు వాసనేస్తూ......బాగుంది(చాలా ఉంది)

  ReplyDelete
  Replies
  1. థాంక్యూ సాంబమూర్తిగారు..

   Delete
 2. బాలింతరపు వాసనేస్తూ....అనేది కాస్త భారంగా అనిపిస్తుందండి...

  ReplyDelete
  Replies
  1. Padmarpitaగారూ గుండె భారమైన వేళ అలానే అనిపిస్తుంది కదా??? మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు...

   Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...