కాలం దొంగిలించిన బాల్యాన్ని
మళ్ళీ గుర్తు చేసాడు వీడు...
తప్పిపోయిన హృదయాన్ని
మళ్ళీ పట్టిచ్చాడు వీడు....
గతమంతా గురుతులుగా
మాసిపోయిన నూనె మరకలా
మిగిలిన నలుపు తెలుపుల
ముఖ చిత్రంపై కాసింత వెన్నెలని
చిలకరించాడు వీడు....
ఏ కాలుష్యమూ అంటని
నవ్వులు విరజిమ్ముతూ భోగీలో
కనుమ వేళ దీపావళిని
వెలిగించాడు వీడు...
(నిన్న విజయనగరం రైలులో వెల్తూన్నప్పుడు ఈ బాబును చూసి యిలా...)
మళ్ళీ గుర్తు చేసాడు వీడు...
తప్పిపోయిన హృదయాన్ని
మళ్ళీ పట్టిచ్చాడు వీడు....
గతమంతా గురుతులుగా
మాసిపోయిన నూనె మరకలా
మిగిలిన నలుపు తెలుపుల
ముఖ చిత్రంపై కాసింత వెన్నెలని
చిలకరించాడు వీడు....
ఏ కాలుష్యమూ అంటని
నవ్వులు విరజిమ్ముతూ భోగీలో
కనుమ వేళ దీపావళిని
వెలిగించాడు వీడు...
(నిన్న విజయనగరం రైలులో వెల్తూన్నప్పుడు ఈ బాబును చూసి యిలా...)
భోగీలో భోగిని దీపావళిని సమ్మిళితం చేసి అసలు సిసలైన ఆనందం అంటే ఏంటో చూపించాడన్నమాట...
ReplyDelete@వాసుదేవ్జీ మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు సార్..
ReplyDeletekids are always GODS who show the beauty and real truth of life :-) wonderful lines varma ji:-)
ReplyDeleteThank you Vijayabhanu Madam...
Delete