Wednesday, January 4, 2012

ఆకాశమే హద్దుగా..

నిరీక్షణ ఫలిస్తే కళ్ళనిండుగా
ఆనందపు సెలయేళ్ళే...

గుండెనిండుగా
పచ్చిక బయళ్ళే...

నీ చుట్టూ
ఓ కాంతివలయం...

కోటి జన్మల ఆవలనుండి
ఓ చేయి నీ నుదుటిపై
ప్రేమగా తాకిన అనుభూతి....

ఓ మధుర సంగీత ఝరి
ఇంపుగా చెవులను తాకుతూ
దేహమంతా పరిమళిస్తుంది...

ఆకాశమే హద్దుగా
....

7 comments:

  1. ఆకాశమే హద్దుగా......
    అంత ఆనందం ఎందుకో, ఏమో,
    ఆ నిరీక్షణ ఎందాకో, ఎవరికోసమో
    కూడా చెప్పవచ్చు కదండీ:-)

    ReplyDelete
  2. కోటి జన్మల ఆవలనుండి
    ఓ చేయి నీ నుదుటిపై
    ప్రేమగా తాకిన అనుభూతి..చాలా బాగుంది! ముంగురులను ప్రేమగా తాకిన అనుభూతి అంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది!

    ReplyDelete
  3. @సుభ/subhaగారు ధన్యవాదాలండీ...

    ReplyDelete
  4. @'Padmarpita'గారు.. మీ కొక్కరికే చెప్దామని ఇక్కడ చెప్పలేదు...ః)

    ధన్యవాదాలు..

    ReplyDelete
  5. @రసజ్ఞ గారు మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ...

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...