Sunday, January 15, 2012

ఆవిష్కరింత....


తొలి పలకరింపుతోనే
ఎన్నో యుగాలుగా కలిసి వున్నట్టు...

తెగిన దారమేదో ముడిపడి
గొంతులో జీరగా ఓ సన్నని
గీతమొకటి ఒలికినట్టు...

కనులముందు వాన వెలుస్తూ తుంపరల
మెరుపులగుండా రంగుల చిత్రమొకటి
ఆవిష్కరిస్తున్నట్టు....

పిలిచినప్పుడంతా
ఓ బంగరు పిచ్చుక నుండి జారిపడిన
రేక అలా ఎగురుకుంటూ మెడ వంపున
చక్కిలిగిలి పెట్టినట్టు....
ఆ ముంగురులను తాకిన సన్నని
గాలి తిమ్మెర సువాసనగా
ముక్కు పుటాలను తాకుతూన్నట్టు...

అలా సందేశమొచ్చినప్పుడంతా
గుండె గదిలో నెత్తురు ఉలికిపడ్డట్టు
కంట్లో ఓ మూలగా కదలిన ప్రతిబింబం
పలకరిస్తూ మెల్లగా చేతి వేళ్ళలో
వెచ్చగా తన వేళ్ళు చొప్పిస్తూ దగ్గరగా
వెచ్చని ఊపిరి సెగలుగా తాకుతూ
చలి పులిని వేటాడుతున్నట్టు....

ఈ బంధమిలా చివరాఖరి ఊపిరి
మెట్టు వరకు దాచి వుంచుతావా............

6 comments:

  1. మాటలు చాలవు వ్యాఖ్యానించేందుకు
    కనులముందు వాన వెలుస్తూ తుంపరల
    మెరుపులగుండా రంగుల చిత్రమొకటి
    ఆవిష్కరిస్తున్నట్టు....
    పిలిచినప్పుడంతా
    ఓ బంగరు పిచ్చుక నుండి జారిపడిన
    రేక అలా ఎగురుకుంటూ మెడ వంపున
    చక్కిలిగిలి పెట్టినట్టు....
    ఆ ముంగురులను తాకిన సన్నని
    గాలి తిమ్మెర సువాసనగా
    ముక్కు పుటాలను తాకుతూన్నట్టు...
    ప్రతిమాటా మనసును తాకేలా
    అభినందనలు

    ReplyDelete
  2. @swatee మేడంగారూ ధన్యవాదాలు....

    ReplyDelete
  3. narra venu gopalJanuary 21, 2012 6:44 PM

    సమాజం లో బాధలని మీ కవితల్లో అంతర్లీనంగా పలికించే మీరు ఇటువంటి ఫీల్ తో రాయడమే విషేశమే కుమార్ సర్

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు వేణుగోపాల్ గారూ..అప్పుడప్పుడూ ఇలా పంచుకుందామని...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...