Thursday, January 12, 2012

నువ్వొస్తావని....


నువ్వొస్తావని
వెండి వెన్నెలలాంటి నీ నవ్వు
సంతకమిస్తావని
ఈ దీప స్థంభపు క్రీనీడలో
నీ రాకకై నిరీక్షిస్తూ వున్నా నేస్తం....

తడి ఆరిపోతున్న గొంతులో
నీ పాటతో ఇన్ని అమృతపు చినుకులను
వర్షిస్తావని ఈ మలుపులో వేచి వున్నా నేస్తం...

ఈ చలి రాతిరి మంచు ముద్దవుతున్న
వేళ నీ వెచ్చని కరస్పర్శతో
నన్ను వెలిగిస్తావని ఈ మాటున ఎదురు చూస్తున్నా నేస్తం...

ఆకాసమంత నేత్రంతో
కాలయంత్రాన్ని బంధించి యుగాలుగా
ఇక్కడే ఇలా ఈ వేళ నీ రాక కోసం...........

12 comments:

  1. కేక్యూబ్ వర్మ గారూ...చాలా బావుంది మీ నిరీక్షణ.

    ReplyDelete
  2. ధన్యవాదాలు జ్యోతిర్మయి గారూ...

    ReplyDelete
  3. కొండగాలి వీచింది...
    గుండె ఊసులాడింది...
    వెన్నెలదారి మళ్ళింది...
    మీ చూపు ప్రేమవైపు మళ్ళింది:-)
    Its beautiful feeling!!

    ReplyDelete
    Replies
    1. @padmarpita గారూ ధన్యవాదాలండీ...ప్రేమలేనిదెప్పుడూ???

      Delete
  4. చాలా బాగుందండీ..

    ReplyDelete
    Replies
    1. సుభ గారూ ధన్యవాదాలండీ...

      Delete
  5. ఈ చలి రాతిరి మంచు ముద్దవుతున్న
    వేళ నీ వెచ్చని కరస్పర్శతో
    నన్ను వెలిగిస్తావని ఈ మాటున ఎదురు చూస్తున్నా అద్భుతమండీ!

    ReplyDelete
  6. @రసజ్ఞ గారు థాంక్సండీ...

    ReplyDelete
  7. చాలా బావుందండీ!

    ReplyDelete
    Replies
    1. థాంక్సండీ చిన్ని ఆశ గారు...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...