రాత్రి...
రాత్రి...
నిద్రను
వెన్నెల
కొక్కేనికి
వేలాడ
దీసి
నలుపు
తెలుపుల
మిశ్రమాన్ని
కలలకు
పూత
పూస్తూ...
జ్ఞాపకాల
పుటలకు
గుండె
తడిని
జిగురుగా
అతికిస్తూ...
గాయాన్ని
రేపే
గానమేదో
నిశ్శబ్దంగా
దేహమంతా
ప్రసరిస్తూ...
రాజుతున్న
మది
నిప్పు
వేలి
చివుళ్ళ
మండుతూ...
ఒంటరిగా
ఖాళీ
కూజాలో
గ్లాసు
నింపని
దాహంతో...
తెలవారని
ఆకాశంలో
నెత్తురోడుతూ
రాలుతున్న
నక్షత్రం
బూడిదౌతూ...
సర్ ఇంత మంచి కవితకి చిత్రమే యాంత్రికంగా ఉందండి.
ReplyDeleteచాలా వెదికా కానీ ఏమీ నచ్చక చివరికిలా.. థాంక్యూ Yohanth సార్..
Deleteఇలాంటి మనసుని తాకే పదాలతో కవితలల్లడం మీకే చెల్లును.
ReplyDeleteమీరిలాంటి మాట చెప్తే మరిన్ని అక్షర దారాలల్లే ఊపిరినిస్తుంది పద్మార్పిత గారూ.. మీ ఆత్మీయతకు ధన్యవాదాలు.
Deleteఎంత రాత్రి అని రాస్తే మాత్రం అంత చీకటి చిత్రం పెట్టాలాండి :-)
ReplyDeleteచీకటిలో వెలుగు మిశ్రమం వుందని అనుకుంటూ పోస్ట్ చేసా..:-)
Deleteమీ అభిమానానికి ధన్యవాదాలు లిపి భావన గారు..
sir.. chaalaa baga rasaru..
ReplyDeletethank you Kiran garu (ఎగిసే అలలు)...
Deleteజ్ఞాపకాల
ReplyDeleteపుటలకు
గుండె
తడిని
జిగురుగా
అతికిస్తూ...
గాయాన్ని
రేపే
గానమేదో
నిశ్శబ్దంగా
దేహమంతా
ప్రసరిస్తూ...
ee lines chaalaa......bagunnayi
Thank you skvramesh garu..
Deleteవర్మగారు పోస్ట్ లు తగ్గించేసారు పదాలు కూడబెడుతున్నారా:)
ReplyDeleteపలికినంతమేర పోస్ట్ చేస్తున్నా అనికేత్..
Deleteఅయినా మీలా young and energetic కాదు కదా..:-)
Thanks for your kind concern..
రాత్రిని కూడా ఇలా నెత్తుటితో ముంచేయాలా...
ReplyDeleteఈ కొప్పులోని మల్లెల మత్తు సోకలేదా వర్మగారూ...:-)
ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంది రాత్రి..
Deleteమీ చతురమైన స్పందనకు ధన్యవాదాలు ఓలమ్మోలమ్మో గారు.. :-)