Thursday, April 4, 2013

యుద్ధము - ప్రేమ



నుబాల కుతి తీరని బాల్యం
వెంటాడుతూ
కలల ఇసుక పుల్లాటల మధ్య
దొరకనితనంతో
అలసి సోలిన కన్రెప్పల
మధ్య ఇన్ని విరిగిపడిన కాంతి రేఖలు...

కాలం మండుతూన్న కొలిమి అంచున
అరిపాదం మంట
నషాళానికి తాకుతూ
దప్పిక తీర్చని అక్షర దాహం
వెన్నాడుతూ
విరిగిపడ్డ అల మధ్యన నురుగు బుడగ...

పరచుకున్న చీకటి తెరల మాటున
మాగన్నుగా పట్టిన నిద్రలో
వులిక్కిపడ్డ మెలకువతో చల్లగా
తాకిన కార్బన్
బెదురును అణచి పెడ్తూ
ట్రిగ్గర్ పై బిగిసిన చూపుడు వేలుతో....

ఆకు చాటున
మబ్బుల గొంగడి భుజాన వేసుకున్న
సందమామ వెనక్కి తిరిగి
ఎటో చూస్తున్నట్టు
తప్పుకుంటుండగా ఇరు వైపులా
కురుస్తున్న నెత్తుటి చినుకులో
యుద్ధాన్ని ముద్దాడుతూ ప్రేమగా...

6 comments:

  1. ఆకు చాటున
    మబ్బుల గొంగడి భుజాన వేసుకున్న
    సందమామ వెనక్కి తిరిగి
    ఎటో చూస్తున్నట్టు
    తప్పుకుంటుండగా ఇరు వైపులా
    కురుస్తున్న నెత్తుటి చినుకులో
    యుద్ధాన్ని ముద్దాడుతూ ప్రేమగా...
    excellent lines sir
    You might also like:

    ReplyDelete
    Replies
    1. skvramesh గారు ఎన్నాళ్ళకి మీ మాట.. ధన్యవాదాలు సర్..

      Delete
  2. కెక్యూబ్ వర్మగారు యుద్ధంపై ప్రేమ పుట్టేలా మీరే రాయగలరు, బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానానికి ధన్యవాదాలు Yohanth గారు.

      Delete
  3. చాన్నాళ్ళకి బ్లాగ్ వైపు కలం కదిపారు.

    ReplyDelete
    Replies
    1. చాలా రోజులకి దర్శించారు మా బ్లాగుని ధన్యవాదాలు తెలుగమ్మాయి గారు...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...