రోడ్లన్నీ ఎండకు కాగుతు తారు మెరుస్తూ
అక్కడక్కడా గతుకుల మధ్య పైకెగసిన రాళ్ళతో...
దప్పికగొన్న కాకి నీటి చుక్క ఒంపని
నల్లాకు అడ్డంగా వేలాడుతూ...
ఆకురాలిన తురాయి చెట్టుకు కాయల
కత్తులు వేలాడుతూ...
ఆవిర్లు రాని టీ గ్లాసు నిండా పోసుకున్న
గొంతు దాటి ఆకలిని చంపుతూ...
మూగ బట్టిన గాలి ముక్కు పుటాలను
మండిస్తూ ఎగశ్వాసపోతూ...
నెత్తురు చెమటగా రాలుతూ రిక్షా
టైరు పంక్చరై పేగులంటిన డొక్కతో...
మురుగు కుంటలో దొర్లుతూ
బురదంటిన కుక్క మూలుగుతూ...
అప్రకటిత కర్ఫ్యూలా రోడ్లన్నీ
నిర్మానుష్యమై నిశ్శబ్ధంగా రొప్పుతూ...
ఎండపట్టిన బతుకు నిండా
ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతూ...
very nice song...for imagination
ReplyDeleteif she really appears before u
u mishandle her drastically..
that is the irony of life..
gourialluri
gourialluri గారు నా బ్లాగు సందర్శించినందులకు ముందుగా మీకు కృతజ్నతలు. మీరు చెప్పిన విషయం గూర్చి మనిషి మృగం నుండే వేరుపడ్డ వాడు కాబట్టి అలా జరిగినా జరగొచ్చు. ప్చ్ మనిషిగా ఎప్పటికి మారుతామో కదా... Thanks a lot..
Deleteఎండవేడి మీ వాడి పదాల్లో కనిపిస్తుందండి.:-)
ReplyDeleteఅవునా... థాంక్సండీ పద్మార్పిత గారూ...మీ మాటెప్పుడూ స్ఫూర్తిదాయకం నాకు..
Deleteఅవునండీ... మీరు మన అగచాట్ల గురించి చెప్పింది నిజం.. చాలా చక్కగా రాశారు...
ReplyDeleteథాంక్యూ ఎగిసే అలలు గారూ..
Deleteమీ నుండి మరిన్ని వాడివేడి సెగల పదప్రవాహాల్ని ఆశిస్తూ
ReplyDeleteతప్పకుండా Tharkam సార్.. మీరిలా ఆదరిస్తూ వుంటే...
Deleteథాంక్యూ సార్,,
ఎండకి ఎలాగో మాడుతున్నాం, మంచి రొమాంటి కవితరాయండి సర్:)
ReplyDeleteఎండలో రొమాన్స్ కష్టమని ఇలా...
Deleteట్రై చేస్తా.. థాంక్యూ అనికేత్..