Friday, April 19, 2013

ఫార్టీ ప్లస్...


అద్దం భయపెడుతోందిప్పుడు!
రోజు రోజుకి తరుగుతున్న చర్మం నునుపుదనంతోపాటు
కళ్ళకింది చారలు వెనక దోబూచులాడుతున్న
లోలోపలి విషాదమేదో ఉబకని కన్నీటి చుక్కను
ఆకు ఈనె చివర ఒడిసి పడ్తూ...

అక్కడక్కడా పొడుచుకొచ్చిన ఎండు గడ్డిలాంటి
తెల్ల వెంట్రుకలతో రాని పెద్దరికమేదో మీదపడి
భుజాలపై మోయరాని భారమేదో కావడి కర్ర
జవ జవలాడుతూ కిందకు గుంజుతున్నట్టు...

పులిమిన నల్ల రంగు వెలసి పోయినప్పుడంతా
రంగు కరిగిన నక్కలా బయటపడుతూ
మూతి మీద మీసంపై మునివేళ్ళతో దాగని సత్యాన్ని దాచిపెడ్తూ...

అటూ ఇటూ చేతులందని పిల్లలు
సందెట్లో ఇమడక చేతులు దాటిపోతూ
కనుపాప వెనక ఉగ్గబట్టి కడుపులో మెలిపెడుతున్న
పేగు బంధాన్ని అత్మీయంగా తడుముకుంటూ....

చిరాకు ప్రతి క్షణం పెదవిపై తప్పని అతిధై
గుండె కింది నరాన్ని పట్టుకుంటూ
కడుపులో HCL స్రావాలు అధికమై
రోకటి పోటులా పొడుస్తూ నుదుట చిట్లిన మడతల
వెనక దోబూచులాడుతూ దూరమవుతున్న
కరచాలనాలతో రాని నవ్వును పులుముకుంటూ...

ఏమైనా నలభైల హర్డిల్ దాటినప్పుడంతా
ఈ ఎగసోప తప్పదేమో కదా నేస్తం!!

12 comments:

  1. మీ మదిలోని అలజడా లేక 40 ప్లస్ లో తేనెటీగ కుట్టాలని చేస్తున్న సవ్వడా :-)

    ReplyDelete
    Replies
    1. మదిలోని అలజడీ ఆందోళనా ఇలా వచ్చిందనుకుంటా పద్మార్పితాజీ.. తేనెటీగ?? :-)
      థాంక్యూ.. <3

      Delete
  2. అవునండి.
    నలభైకి ముందు శరీరం మన మాట వింటుంది.
    తరువాత మన శరీరం మాట వినాలి.

    ReplyDelete
    Replies
    1. అంతేనంటారా bonagiri gaaru :-)
      Thanks for your kind response...

      Delete
  3. అవునెమో! 40+ తరువాత అలానె అనిపిస్తుండచ్చు..-:)

    ReplyDelete
    Replies
    1. అవునా.. అయితే సరే...:-) Thank you కార్తీక్ గారు..

      Delete
  4. నిజమా....అప్పుడే 40ప్లస్ అంటే ఎలాసర్ :-)

    ReplyDelete
    Replies
    1. మరీ 20+ అంటే బాగోదేమోనని :-) Thank you..

      Delete
  5. ఇటీవల చదివిన మంచి కవితలలో ఈ మీ కవిత కూడా ఒకటి . ఎన్నో ఒడిసి పట్టుకోవాలని ఉంటుంది అలాగే మన వయస్సు కూడిన మనసుని కూడా . రెండు మనదగ్గర ఉండవు ఽదె మీ కవితాక్షరం కూడా .

    చాలా బావుంది అనే మాట చాలా తక్కువ వర్మ గారు

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన స్పందనతో స్ఫూర్తినిచ్చారు వనజవనమాలి గారు.. ధన్యవాదాలు...

      Delete
  6. నేనూ 40+కి చేరాను కానీ, ఇప్పటి రోజుల్లో 50+ని middle age అనాలేమో. Still all my friends r feeling younger by their heart. మనసుకి మార్పు వస్తుందంటారా? Cheer up!

    ReplyDelete
    Replies
    1. శరీరంలో వచ్చే రసాయనిక మార్పులన్నీ మనసుపై కూడా ప్రభావం చూపుతాయి కాదంటారా?
      Thank you అనూ గారు..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...