Wednesday, April 24, 2013

రాత్రి...

 
 
 
 
 
 
 
 
 
రాత్రి...

నిద్రను
వెన్నెల
కొక్కేనికి
వేలాడ
దీసి
నలుపు
తెలుపుల
మిశ్రమాన్ని
కలలకు
పూత
పూస్తూ...
జ్ఞాపకాల
పుటలకు
గుండె
తడిని
జిగురుగా
అతికిస్తూ...

గాయాన్ని
రేపే
గానమేదో
నిశ్శబ్దంగా
దేహమంతా
ప్రసరిస్తూ...

రాజుతున్న
మది
నిప్పు
వేలి
చివుళ్ళ
మండుతూ...

ఒంటరిగా
ఖాళీ
కూజాలో
గ్లాసు
నింపని
దాహంతో...

తెలవారని
ఆకాశంలో
నెత్తురోడుతూ
రాలుతున్న
నక్షత్రం
బూడిదౌతూ...

14 comments:

  1. సర్ ఇంత మంచి కవితకి చిత్రమే యాంత్రికంగా ఉందండి.

    ReplyDelete
    Replies
    1. చాలా వెదికా కానీ ఏమీ నచ్చక చివరికిలా.. థాంక్యూ Yohanth సార్..

      Delete
  2. ఇలాంటి మనసుని తాకే పదాలతో కవితలల్లడం మీకే చెల్లును.

    ReplyDelete
    Replies
    1. మీరిలాంటి మాట చెప్తే మరిన్ని అక్షర దారాలల్లే ఊపిరినిస్తుంది పద్మార్పిత గారూ.. మీ ఆత్మీయతకు ధన్యవాదాలు.

      Delete
  3. ఎంత రాత్రి అని రాస్తే మాత్రం అంత చీకటి చిత్రం పెట్టాలాండి :-)

    ReplyDelete
    Replies
    1. చీకటిలో వెలుగు మిశ్రమం వుందని అనుకుంటూ పోస్ట్ చేసా..:-)
      మీ అభిమానానికి ధన్యవాదాలు లిపి భావన గారు..

      Delete
  4. sir.. chaalaa baga rasaru..

    ReplyDelete
  5. జ్ఞాపకాల
    పుటలకు
    గుండె
    తడిని
    జిగురుగా
    అతికిస్తూ...

    గాయాన్ని
    రేపే
    గానమేదో
    నిశ్శబ్దంగా
    దేహమంతా
    ప్రసరిస్తూ...
    ee lines chaalaa......bagunnayi

    ReplyDelete
  6. వర్మగారు పోస్ట్ లు తగ్గించేసారు పదాలు కూడబెడుతున్నారా:)

    ReplyDelete
    Replies
    1. పలికినంతమేర పోస్ట్ చేస్తున్నా అనికేత్..
      అయినా మీలా young and energetic కాదు కదా..:-)
      Thanks for your kind concern..

      Delete
  7. రాత్రిని కూడా ఇలా నెత్తుటితో ముంచేయాలా...
    ఈ కొప్పులోని మల్లెల మత్తు సోకలేదా వర్మగారూ...:-)

    ReplyDelete
    Replies
    1. ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుంది రాత్రి..
      మీ చతురమైన స్పందనకు ధన్యవాదాలు ఓలమ్మోలమ్మో గారు.. :-)

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...