Monday, January 9, 2012

కలలనేత...



వరుసగా గోడపై పలు ఆకారాల్లో
ముఖపు బొమ్మలు అతుక్కుని తదేకంగా చూస్తున్నాయి....

అందులో గెడ్డం మాసిన బొమ్మొకటి
అలా చూస్తుంటే ఏదో వెలితి ఆ కళ్ళలో ....

గుండెల్లో ఓ మూల

ఎవరిదీ అన్న అనుమానంతో పాటు
సందేహమొకటి వెన్నాడుతూ...

ఆ పక్కగా బవిరి గెడ్డంతో ఓ మొఖం
ఏదో చెప్పాలని చూస్తున్నట్టు
కళ్ళతో నవ్వుతూ పిలుస్తూ....

ఇంతలో మరో మొఖం గాటుపడ్డ వెంబడి
ఎర్ర చారతో తీక్షణంగా చూస్తూ
హెచ్చరిస్తూన్నట్టుగా.....

ఏవో నీడల జాడల వెంబడి
అలా జారిపోతున్నట్టు
కనికట్టులా ఒక్కోటి అదృశ్యమవుతూ
ఇంతలో గోడంతా మరకలు మరకలేవో
పులుముకుంటూ.....

అసంపూర్ణ పద్యాన్ని గట్టిగా ఆలపిస్తూ
కీచుమంటున్న గొంతొకటి
శబ్ధిస్తూ...


పీలికలైన గుడ్డ దారాలన్నీ
అతికీ అతకనట్టుగా
కలలనేత......

ఉలిక్కిపడి లేవగా
కాళ్ళు రెండూ తెగిపడిపోయినట్టు
మనిషినంతా ఓ మూలగా....

8 comments:

  1. తెలిసీ తెలియని భావమేదో
    ఎద లోపలి చీకటి మాటున
    సంశయంగా నను పలకరిస్తూ ...

    ReplyDelete
  2. కెక్యూబ్ గారు..... కనీసం కలలనైనా కమ్మగా కనొచ్చుగా:-)

    ReplyDelete
  3. @జ్యోతిర్మయిః అక్కా ధన్యవాదాలు

    ReplyDelete
  4. @'Padmarpita'గారు కలలు మన చేతుల్లో లేనివి కదా...గుండెలోని గుబులే కదా అలా ప్రతిఫలిస్తాయి...ధన్యవాదాలు...

    ReplyDelete
  5. @తెలుగు పాటలు గారు థాంక్సండీ...

    ReplyDelete
  6. ilaaa nijangane jarigedi naa vishayam lo! when i was an adolescent, i used to watch the walls so keenly...where i found so many faces and images...i used to write poetry on what i used to see and feel...it was a strange phase i could never forget. ur poem took me back to those days...thanks varma ji :-)

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...