Wednesday, February 18, 2009

గాయమైన స్వప్నం

నేనిప్పుడు దేన్నీ మనసారా
ఆహ్వాని౦చలేక పోతున్నాను!
ఆస్వాది౦చ లేకపోతున్నాను!
ఆన౦ది౦చ లేకపోతున్నాను!
అనుభవి౦చ లేకపోతున్నాను!
కడుపారా దుఖి౦చలేకపోతున్నాను..

కుమిలి కుమిలి దుఃఖం సుళ్ళు తిరిగి
కనులోయల్లోనే ఘనీభవిస్తో౦ది
రెటీనాకు అడ్డంగా ఏదో గ్లేసియర్

ఏదో......
బరువైనదేదో..
టన్నుల కొద్దీ భారమైనదేదో...
గు౦దెలపై కూచున్నట్టు౦టుది.....

వేల కొద్ది గుఱపు డెక్కల చప్పుడు
కర్ణభేరి పగిలిపోయేట్టు..

మెదడులో నరాలు తెగిపోయేట్టు
సిరలను౦డి రక్తాన్ని ఎవరో
సిరంజీలతో లాగుతున్నట్టు ......

దేనికి స్పందించలేని
స్ఫటికామాత్రపు కనులతో
ఎన్నాళ్ళీ క్షోభ.....

న్యూస్ ఎక్స్ ప్రెస్ , ఫ్లాష్ ఫ్లాష్,
క్రైమ్ ఫైల్, క్రైమ్ న్యూస్
యదార్థ వ్యదార్థ దృశ్యాల సమాహార౦తో
మెదడు పక్షవాతానికి గురౌతో౦ది...

కొయ్య గుర్రంపై స్వారీ
యింకెన్నాళ్ళు?
జీవశ్చవాలమై
శిలాజాలుగా మారిపోతున్నామా!
లీటర్ల గ్లిజరిన్ పోసినా
కన్నీళ్ళు రాని కనుపాపల లోయలు...

భూమిలో దిగబడిన రధ చక్రాన్ని
గాయమైన హృదయంతో
పైకెత్తుతూ...

పగిలిన కనుగుడ్లలో
గాయమైన స్వప్నం ............

3 comments:

  1. good moning sir, kavita patadeina nithya nuthanam,vallu marcharu, manam maramu ela sir!!!!!!!!??????????

    ReplyDelete
  2. జీవశ్చవాలమై
    శిలాజాలుగా మారిపోతున్నామా!
    ఉప్పొంగిన ఉద్వేగం .....అవును సిలాజాలుగా మారుతున్న జాడలు భవిష్య తరాలకు పరిశోధనా వస్తువులు ...భువి పై భవితంటూ వుంటే ...అభినందనలు .Nutakki Raghavendra Rao (Kanakaambaram)

    ReplyDelete
  3. @కనకాంబరంః ధన్యవాదాలు గురూజీ..

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...