Friday, April 17, 2009

విధ్వంసం ఆవలి వైపు

ఇప్పుడు నేను కవిత్వం
రాయలేకపోతున్నాను

నా అక్షరాల మాటున దాగిన
సన్నని దారాన్ని ఎవరో
పుటుక్ పుటుక్ మని తెంపుతున్న శబ్ధం......

నా చుట్టూ ఎవరో సమాధి రాళ్ళను
చక చకా పేర్చుతున్న దృశ్యం
తెరలు తెరలుగా నా కళ్ళముందు.....

గుండెలపై టన్నులకొద్దీ బరువైన ఇనుప
దిమ్మెలను పేర్చుతు౦టే
పట పట మని విరిగిపడుతున్న
ఎముకల శబ్ధం...

కూరుకుపోతున్న దుర్గంధమయ ఉబిలోను౦చి
శ్వాస కోసం నా ముక్కు పుతాలను
పైకి లాక్కు౦టూ.....

కానీ
చివరాఖరకి తూర్పు ను౦డి ఒక సన్నని
గాలి తిమ్మెర నన్ను తాకుతూ...

4 comments:

  1. కవిత బాగుంది, కానీ నాకు కొన్ని పదాలకు అర్ధం తెలియడం లేదు
    "సమమది"
    "పెర్చుతుమ్టే"
    "పుతాలను"
    ముద్రా రాక్షసాలు సరిదిద్దుతారని ఆశిస్తున్నాను

    ReplyDelete
  2. వర్మ గారూ చాలా బాగుంది.

    ReplyDelete
  3. మీ ప్రొఫైల్ చూసాను. మీరు మార్క్సిజం, మాక్సిం గోర్కీ పుస్తకాలు చదుతారని వ్రాసి ఉంది. నేను కూడా ఆ పుస్తకాలు చదువుతుంటాను. మీ ఊరు పార్వతిపురం అని వ్రాసారు. అది విజయనగరం జిల్లా పార్వతిపురమేనా? ఎందుకంటే రాష్ట్రంలో పార్వతిపురం పేరుతో రెండు ఊర్లు ఉన్నాయి. అందుకే కన్ఫ్యూజన్. నేను ఉండేది శ్రీకాకుళం పట్టణంలో. విజయనగరం జిల్లా పార్వతిపురం మాకు 84 కిలో మీటర్ల దూరం. అందుకే నాకు క్యూరియాసిటీ కలిగింది.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...