Friday, February 13, 2009

పదకొండో నంబర్ సీటు

భూమిని వెనక్కి తోసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న రైలు బందికంతే వేగంగా నా మనసు గమ్యాన్ని చేరుకుంటోంది... ప్రియురాలి జడలోని సన్నజాజుల వాసనలు నా నాశికకు తాకుతున్న అనుభూతి... తన మునివేళ్ళ మృదుత్వం నా చేతివేళ్ళ చిగుళ్ళలో పాకుతోంది... సూపర్ సోనిక్ వేగంతో తన ఒడిలో వాలిపోవాలన్న తాపత్రయంతో రెక్కలల్లార్చుకు౦టూ ని౦గిలోకి ఎగసే పక్షిలా నా భుజాలను మాటి మాటికి కదుపుతూన్నా.......
అనకొ౦దలా౦టి ట్రైను కడుపులో ఒక కిటికీ మూల పదకొ౦దో న౦బరు సీటులో నేను........

1 comment:

  1. వర్మ గారూ ! మీ బ్లాగ్ బావుందండీ ! టపాలన్నీ బావున్నాయ్ .అభినందనలు .

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...