Friday, February 13, 2009

అద్దంలో అదృశ్యం

యిప్పుడు నేను ప్రతి ఒక్కరి ముఖం
పదే పదే చూస్తున్నాను
పరిచయస్తుదినైనా
అపరిచుతుడినైనా
కళ్ళలో కళ్లు పెట్టి నా రెటీనాపై
ఒక ఫోటో తీసుకొని
మస్తిష్కపు మెమొరీలో
నిక్షిప్తం చేసుకొనేందుకు
ప్రయత్నిస్తున్నా
ఎందుకంటే
నిన్నో, మొన్నో, నేడో, గంటో, నిమిషమో
ఈ క్షణం క్రితమో కన్పించినవాళ్ళు
మళ్ళీ కన్పిస్తారన్న నమ్మకం
కోల్పోయినవాన్ని

కరచాలనమిచ్చి స్వాగతించిన చేతులు
ఆప్యాయ౦గా ఆలి౦గనమ్ చేసుకున్న చేతులు
చిరునవ్వులతో పలకరించిన కళ్లు
మళ్ళీ సాక్షాత్కరిస్తాయా అని

యిలా ఎ౦దరినో కోల్పోయి
చివరాఖరుకు అద్ద౦ ము౦దు
నేను అస్పష్టంగా...



5 comments:

  1. హాయ్ మిత్రమా నీ బ్లాగ్ చాలా బాగుంది. మీరు మాబ్లాగ్ కు రండి నేను మీ బ్లాగ్ కు వస్తాము. ఇలా కూడా బ్లాగ్ అందరి కి పరిచయం అవుతుంది.
    http://www.tourismb4u.blogspot.com
    http://www.telugu-ruchulu.blogspot.com/

    ReplyDelete
  2. mee kavitha chaala baagundi, nenu konni rasanu meela kaakunna edo naa manasu palikila palukulu

    @http://naren-kavitala-selayeru.blogspot.com/ choosi mee abhipram cheppandi...

    ReplyDelete
  3. చాలా బాగుంది కవిత.
    చాలా కాలం క్రితం ఆశారాజు వ్రాసిన ఓ కవిత గుర్తుకు వచ్చింది. (దానికీ దీనికీ సంబంధమేమీ లేదు సుమా. ఎందుకో పంచుకోవాలనిపిస్తుంది)

    మిత్రుడు చనిపోయిన వార్త కవికి ఆలస్యంగా తెలుస్తుంది. అరరే మొన్న నాతో బాగానే మాట్లాడాడు కదా. ఇంతలోనే ఏమయ్యింది. అంటూ మధనపడి, అకస్మాత్తుగా ఏదో గుర్తుకువచ్చినవాడిలా, ఊర్లో ఉండే అమ్మకు ఫోన్ చేయాలనిఉంది, మావయ్యకు ఫోన్ చేయాలని ఉంది, చిన్ననాటి మిత్రులు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఉంది, అరరే అలా రోడ్డుమీద పోతున్న వానిని పలకరించాలని ఉంది. ఏమో రేపు ఏమైనా జరగొచ్చు కదా... అంటూ సాగుతుంది కవిత.
    ఒక మానసిక స్థితిని యధాతధంగా పట్టుకొన్న కవిత అది.

    మీ కవిత కూడా అలాగే హాంటింగా ఉంది.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  4. కుమార్ గారు! మీ కవిత చాలా బాగుంది, వాస్తవాన్ని ఆవిష్కరిస్తూనే ఆశావాదాన్ని తెలియజేసింది. మీరన్నట్లు చాలా చిన్నది జీవితం అందులో ఏ క్షణం ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు.

    అభినందనలు

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...