Saturday, August 10, 2013

కొకూన్స్...


ఇప్పుడంతా ఎవరి చేతులలో

వాళ్ళు బంధీలే


ఎవరి కౌగిలిలో వాళ్ళు ఊపిరాడక 

ఉక్కపోతతో ఉరితనంలో


బిగియని బాహువుల మద్య గాలి 

చొరబడక తల్లడిల్లుతూ ఊరడిల్లుతూ


సలపరమెట్టే గాయమే హాయిగా

పెచ్చులూడూతూ పగిలిపోతూ


ఒంటరి దాహార్తితో చౌరాస్తాలో

ఏకాకిగా పాదం పాతుకుపోతూ


రాలే ఆకుల నడుమ గూడు కూలి 

గుడ్డు పగిలి ఎగిరిపోయిన 

జంట పక్షి ఒంటరిగా నేల రాలుతూ...

6 comments:

  1. నిజమే...ఇప్పుడంతా ఎవరి చేతులలో వాళ్ళం బందీలమే....ఈ బంధనాలను తప్పించే క్షణం కోసం ఎదురుచూస్తూ...

    Heart touching 'kavivarma' garu...

    ReplyDelete
  2. ఇలా ఎవరికి వారే అనుకుంటే....ఏముంటుంది చెప్పండి.

    ReplyDelete
    Replies
    1. prakkavaalanante baagodu kadaa aniketh..:) just for kidding..

      okko manahsthitilo okkolaa untaamkadaa.. thanks for commenting..

      Delete
  3. ప్రతి మనసుకూ, పరిస్థితికీ అక్షర సాక్ష్యం ఈ కవిత. మీ పదాలు చిన్నగా ఉన్నా సుతిమెత్తగా సూటిగా , విపులంగా హత్తుకుంటాయి. చాలా బాగుంది వర్మగారు

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు ఫాతిమాజీ..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...