Wednesday, November 28, 2012

గాలి గోపురం..

ఓ చిన్న పొరపాటో తడబాటో
ముక్కలై గుచ్చుకుంటుంది....



తీరం చేరనీయని
ఆవేదన మిగులుతుంది....



ఉబకని కన్నీరు ఎద సంద్రంలో
తుఫాను సృష్టిస్తుంది....



నిలిచిన గాలి గోపురం
ఒక్కసారిగా ఒరిగి పోతుంది....



దిగులుతనం దీపపు సమ్మె క్రింద
నీడలా మిగులుతుంది....



కాలికింద నేల ఊబిలా
లోలోపలికి ఇంకిపోతుంది....



చినిగిన తెరచాపను అంటిన
కలల రెపరెపల రంగుల కాగితం...

ఎద తడపని వాన చినుకు
ఇగిరి పోయి బీడవుతుంది....



మళ్ళీ నీ చిరునవ్వే కదా
నాలో వెన్నెల కురిపించేది నేస్తం...

10 comments:

  1. అదేంటో...ఈ స్నేహం అప్పుడే దీపకాంతిలా వెలుగునిస్తుంది అంతలోనే అఘాధంలోకి తోసివేస్తుంది, మీ కవితలోలా:-) అయినా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. తెలుగమ్మాయి గారూ స్నేహ మాధుర్యం తెలిసేది ఇలాగేకదండీ...మీరు బాగుందనడం బాగుంది..థాంక్యూ..

      Delete
  2. కవితలోని భావ హృదయానికి హత్తుకునేలా ఉందండి.....నిజమేనా:-)

    ReplyDelete
  3. varmaaji, vennela laanti aa chirunavvu chaalu jeevitaaniki.

    ReplyDelete
    Replies
    1. అంతెకదా ఫాతిమాజీ...థాంక్యూ..

      Delete
  4. Replies
    1. కావ్యాంజలి గారూ థాంక్సండీ...

      Delete
  5. చిత్రం ఆకట్టుకుంది వర్మ గారు.

    "ఓ చిన్న పొరపాటో తడబాటో
    ముక్కలై గుచ్చుకుంటుంది....
    నిలిచిన గాలి గోపురం
    ఒక్కసారిగా ఒరిగి పోతుంది...."

    ఈ నాలుగు లైన్స్ చాలా చాలా బాగున్నాయి వర్మ గరు. ఎప్పటిలాగే ఎంతో బాగుంది.

    ReplyDelete
    Replies
    1. నచ్చి మెచ్చినందుకు ధన్యవాదాలు జలతారు వెన్నెలగారూ..అప్పుడప్పుడూ తళుక్కుమంటున్నారిలా..??

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...