Sunday, November 4, 2012

రేణువులు

రెండు పిడికిళ్ళ నిండా తీసుకున్న ఇసుక
వేళ్ళ సందుల గుండా కరిగిపోతూ....

ఎంత తీసుకున్నా
దాచుకోలేనితనంతో ఓడిపోతూ....

కాలాన్ని అలా పట్టుకోలేనితనం
వెక్కిరిస్తూ నీముందు యిలా...

ఎంత వేడుకున్నా నీవు
నవ్వని ఆ క్షణాలు నాకెందుకు??

రాతిరంతా మూగతనంతో
గొంతుతో పాటు దేహమూ కాలిపోనీ...

యిన్నిన్ని కోల్పోయిన ఇసుక రేణువులు
మరల నీ వేలి చివర మెరుస్తూ దరి చేర్చవా??

8 comments:

  1. ఏ పనితనమైనా మీ భావుకత్వం ముందు దిగదుడుపేలెండి:-)

    ReplyDelete
  2. ఫోటో పెట్టకపోతే మీ భావాల్లోని లోతుల్ని కనుక్కోవడం కాస్త కష్టమేనండి వర్మగారు:-)

    ReplyDelete
  3. varma garu as usual chaalaa baagundandi

    ReplyDelete
  4. :)) బాగుందండి వర్మ గారు

    ReplyDelete
  5. చాలా చక్కగా పలికిస్తారు భావాలని మీ ప్రతి కవితలో

    ReplyDelete
  6. కాలాన్ని అలా పట్టుకోలేనితనం
    వెక్కిరిస్తూ నీముందు యిలా...
    భావన బాగుందండీ..

    ReplyDelete
  7. @సృజన గారు: మీ స్పందన ఎక్కడికో తీసుకు పోయింది :-) thank you...
    @ప్రేరణ్ గారుః మీకర్థం కాకపోవడమేంటి?? మీరు మనసునే చదివేస్తుంటేను...:)
    @వీణాలహరి గారుః Many Many thanks..
    @మంజు గారుః ధన్యవాదాలు..
    @జలతారువెన్నల గారుః ధన్యవాదాలు..
    @Yohanth: మీ స్ఫూర్తిదాయక స్పందనకు ధన్యవాదాలు సర్..
    @సుభ గారుః అభివందనాలు..

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...