Sunday, March 20, 2011

వేడుకోలు..











పుట్టుకతోనో,
చిన్ననాడో,
ప్రమాదవశాత్తుగానో,

శరీరాంగం తిరిగిరాని
మొలకలా
వెక్కిరిస్తూ
నిరంతరం
మనసును దొలుస్తూ...

అన్నీ
వున్నాయన్న

వాడి
వెకిలి చూపు

బాధిస్తూన్న

జీవితం
పట్ల

పోగొట్టుకోలేని
ప్రేమ
నిబ్బరంగా
వెలిగిస్తూ
ఆసరాగా
ఓ కఱ ఇచ్చిన
ఊతనివ్వలేని

వారి
నిర్జీవ మనసును

చూసి నవ్వుకుంటూ....


మీ మీ జాలితనం
మాకొద్దు
మిత్రులారా

అవిటితనంలేని
మనసు
కలిగివుంటే
చాలని విన్నపం...

(నేడు వికలాంగుల దినోత్సవం సందర్భంగా)

1 comment:

  1. కేక్యూబ్ గారికి, నమస్కారములు.

    చక్కటి కవిత. వికలామ్గత్వం మనసుకు లేదు అని చెప్పటంలో కృతకృత్యులయ్యారు. ``తిరిగిరాని మొలకలా వెక్కిరిస్తూ ..'' అనే ఈ వాక్యంలో, తిరిగిరాని మొలకలా అనే బదులు ఎదగలేని మొలకలా అని వుంటే భావం అర్ధవంతంగా వుండేదని నా భావన. ఎందుకంటే మొలక అంటేనే ఎదిగేదని అర్ధం. ఎదగలేని మొలకలా అని అంటే పోయిన శరీరాంగమ్ మళ్ళీ ఎదగలేదని చిప్పనట్లవుతుంది.

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...