ఈ రోజు నీది కావచ్చు
నీ చేతిలో తుపాకీ నా గుండెల్లో
గురి చూసావు
ఎవడో విసిరిన బొమికలకు
ఆశపడి మా జీవితాలను
బొగ్గు చేయడాన్ని
అడ్డుకున్న మమ్మల్ని
కాల్చి,
మా గుడిసెల్ని
మసి చేసి నువ్వు
విభూదిగా ధరించి
వీరంగం వేయొచ్చు...
మా ఊళ్ళని బీడు చేసే
కుట్ర
అదిక్కడితో ఆగదు
రేపటి సూరీడుని
మసి బార్చే ఈ అగ్గి
కుంపట్లు నీ ఊపిరినీ
ఆర్పేంత వరకు
ఆగవు...
నెత్తుటి బాకీ
తీరక మానదు..
అది ఈ మట్టి వారసత్వం
(నిన్న సిక్కోలు కాకరాపల్లి వద్ద జరిగిన పోలీసు కాల్పులలో మరణించిన జీరు నాగేశ్వరరావు, శీరపు ఎఱయ్యల వాగ్ధానం)
super...
ReplyDeleteraajadhaani lo jarige akramaalanu aapaleni
daddammalu, velli manyaallo amaayakula meedaaa veella veera prataapaaalu
"పోలీసు కాల్పులలో మరణించిన జీరు నాగేశ్వరరావు, శీరపు ఎఱయ్యల వాగ్ధానం"
ReplyDeleteవాగ్దానం ఎవరికి? కాల్పులు జరుగుతాయని వూహించి వెళ్ళారా? తెలుగు బాగావుంది, బాగా చదువుకున్న వారిలా వున్నారు.
ఒక్కోసారి చదవడానికే కష్టం అనిపిస్తుంది.అనుభావిన్చేవారికి ఎలా వుండాలి?
ReplyDeleteబాగుంది..
గుండె బరువుతోలక్ష్మీ రాఘవ
మొదటి అజ్నాత గారికిః ధన్యవాదాలతో.. రాజధానిలో జరుగుతున్నది జరుగుతోంది. ఎక్కడైనా మనం కోరుకోవాల్సింది జులుం లేని వ్యవస్థనే.. ఒక దానిపైవున్న కోపాన్ని తీర్చుకోవడం కోసం అవకాశమిస్తే అది అలవాటుగా మారి అది తిరిగి మనల్నే కాటు వేస్తుంది...
ReplyDeleteరెండో అజ్నాత గారికిః వాగ్ధానం తమ వారసులమైన మనకు.. మనం చేయగలిగేది వారి నెత్తుటి బాకీ తీర్చడమే.. కాల్పులు జరుగుతాయని ఎవ్వరూ వెళ్ళరు.. అక్కడ వున్నది మహిళలు పిల్లలే ఎక్కువ.. అలా నిరాయుధులపై నిర్ధాక్షిణ్యంగా 303 రైఫిల్ తో కాల్పులు జరిపి, రబ్బర్ బుల్లెట్ల వలన చనిపోయారని ప్రకటించిన మహిళా హోం గారు ఎలా మాటాడగలుగుతున్నారో అర్థం చేసుకోండి.. ఈ రోజు కేంద్ర పర్యావరణ శాఖవారు అక్కడి ప్లాంటు నిర్మాణాలను ఆపమని ఆదేశాలిచ్చారు. ఆ పని ముందే చేసి వుంటే ఈ హత్యలు జరిగివుండేవి కావు కదా? ఇంతమంది రోడ్డున పడే వారు కాదు కదా? ప్రతి సారారీ ప్రజల ప్రాణాలరించాక ఇటువంటి చర్యలు తీసుకొని వుపయోగమేముంది?
ReplyDelete@లక్ష్మీ రాఘవగారు మీ ఆర్థ్ర పూరిత స్పందనకు ధన్యవాదాలు..
ReplyDeleteమేము వారసులం కాము.
ReplyDeleteనిరాయుధులు పోలీసు జీపును తగలబెట్టారు. పోలీసులమీద రాళ్ళ దాడికి వెళ్ళారు, కాల్పుల్లో సచ్చారు. అనువైనచోట్ల విద్యుత్కేంద్రం పెట్టనీయరు,కరెంట్ మాత్రం అందరికీ కావాలంటే ఎలా? వుద్యోగాలు, అభివృద్ధి కావాల. ఎక్కణ్ణుంచి వస్తుంది అనే బుద్ధిలేకుంటే ఎలా?
@అజ్నాత గారు కాల్పుల తర్వాతే పోలీసు జీపు తగలబెట్టారు. అత్యల్ప జనాభా కలిగిన గ్రామాలలో వేలాది సాయుధమూకలను దింపి వాళ్ళను భయభ్రాంతులను చేస్తూ బయటి ప్రాంతాలతో లింక్ తెంపి, వారపు సంత జరగనివ్వకుండా చేసి తమ జీవితాలను ఆగమాగం చేస్తే మరి ఎలా ఎదుర్కొంటారు, పిల్లైనా తలుపులు మూసి కొట్టి చూడండి. ఆ ప్రాంతం అనువైనదని మీరు చూసారా. అది బీల ప్రాంతం. వందలాది ఎకరాలలో నీరు నిల్వ వుండి మత్స్య సంపదకు ఆలవాలమైన చోటూ. ప్రకృతి పరంగా ఏర్పడ్డ ఊట ప్రాంతం. పెట్టబోయే పరిశ్రమ వ్యాపారపరంగా వస్తున్నది. అది ప్రభుత్వానికి విద్యుత్ ను అమ్మేది కాదు. భాగస్వామ్యం కూడా లేనిది. దానిని కాపాడే ప్రయత్నంలో ప్రజలను చంపడానికి కూడా వెనకాడని నియంతలున్న ప్రభుత మనది. ప్రజలకు నిలువ నీడ లేకుండా జేసి ఎవరికి ఉద్యోగాలిస్తారు. వినాశకర అభివృద్ది మాకక్కరలేదు.
ReplyDelete1) వాళ్ళు నిరాయుధులు కారు, సాయుధులు అని ఒప్పుకుంటారా?
ReplyDelete2) నందిగామ్ తో ఈ సంఘటనలను మీరు ఎలా పోలుస్తారు?
3) ఆగమాగం అని వాడారు, మీరు తెలంగాణలో,ఉత్తరాంధ్రలోనూ ఆమాట కొస్తే కమ్యూనిస్ట్ అధికార రాష్ట్రాల్లో తప్ప, ఎక్కడైనా ప్రజలను ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం కాదా?
4) మాకు అభివృద్ధి అక్కరలేదు అన్నారు. పేదరికం, నిరక్ష్రాస్యత వున్నచోట్లె మీ మావోలు మనగలుగుతారు, అందుకే మీకు అభివృద్ధి అక్కరలేదు, అందరూ అలానే వుండాలా?
నువ్వు నన్ను చంపగలవేమొగాని
ReplyDeleteనా ఆశయాన్ని చంపలేవు
నా నోటి కాడి కూడు నీ
ప్రాజెక్ట్ బూడిదతొ విషమై
నా వాల్ల ప్రాణాలు తియ్యకముందే
నిన్ను మా భీలలొ ముంచడానికి నేను
ముందుంటాను
నా నెత్తురు చిమ్మిన ఈ నేలలొ
అగ్నిని పుట్టించి నిన్ను భస్మిపటలము
చేస్తాను
మరొ ఆజాద్ ను సౄష్టించి నిన్నూ
నీ తాబేదారుల వూపిరిని నాలొ
కలుపుకుకుని నెత్తుటి బాకి
తీర్చుకుంటాను