Wednesday, March 2, 2011

డిక్లరేషన్..




పరిశ్రమలు,
అభివృద్ది,
ఉద్యోగాలు
ఇవన్నీ కావలసినవే
కాదనం..

కానీ మా బతుకుల్ని
బూడిద చేసి
వాటిపై నిర్మించే
అభివృద్ధి సౌధాలు
ఎవరికోసం?

మా
ప్రశ్నలకు

మీ తుపాకీ తూటాలు
సమాధానమైనప్పుడు
మరి మాకెవరు దిక్కు?

ఇది కాదా హింస?
ఇది కాదా రక్తపాతం?
ఇదేనా ప్రజాస్వామ్యం?
ఐతే మాకొద్దు యివన్నీ..

4 comments:

  1. >>>> ఐతే మాకొద్దు యివన్నీ. <<<<<
    వాడు మనిషైతే కదా వద్దనగానే భల్లూకపు పట్టు విడిచి పెట్టేది.
    దోచుకునే వాడికి, దురాక్రమణ దారుడికి, తేలుకి న్యాయాన్యాయ విచక్షణ,
    ధర్మాధర్మ మీమాంస వుండదు.
    అందుకే కురుక్షేత్ర సంగ్రామం తప్పదు.
    అనివార్యం యుద్ధం
    సత్యమేవ జయతే.

    ReplyDelete
  2. @అజ్ఞాతః మీ ప్రజల పక్ష స్పందనకు ధన్యవాదాలు..

    ReplyDelete
  3. నిరాహార దీక్షలు చేస్తే తెలంగాణా వస్తుందా?
    48 గంటల బందులు చేస్తే తెలంగాణా వస్తుందా?
    12 గంటలు రైల్ రోకో చేస్తే తెలంగాణా వస్తుందా?
    నాలుగు లక్షల ఉద్యోగులు వారాల తరబడి సహాయ నిరాకరణ చేస్తే
    తెలంగాణా వస్తుందా?
    మొత్తం తెలంగాణా జనమంతా వచ్చి హైదరాబాద్ లో మిలియన్ మార్చ్ చేస్తే వస్తుందా?
    రాజీనామాలు చేసి ప్రత్యర్ధులకు డిపాజిట్లు కూడా రాకుండా గెలిచి చూపిస్తే తెలంగాణా వస్తుందా?
    600 మంది ఆత్మ హత్యలు చేసుకుంటే తెలంగాణా వస్తుందా ?????????????
    ....
    600 కాదు 6000 మంది ఆత్మహత్యలు చేసుకున్నా తెలంగాణా రాదు.
    ఎందుకంటే
    తెలంగాణా రాకుండా
    ఎక్కడ మీటలు నొక్కాలో అక్కడ నొక్కుతున్నాం మేం !!!!!
    మా ధన బలం ముందు మీ జన బలం బలాదూర్....!

    కాబట్టి
    దాడులు చేస్తేనే, గోచి ఊడిపోయేలా మమ్మల్ని తన్ని తరిమితేనే తెలంగాణా వస్తుంది.
    ఇట్లు
    ఆంధ్ర బాండి కూట్స్

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...