Tuesday, March 8, 2011
ఆకాశంలో సగమేనా?
కొలమానం లేని
మా సెమట సుక్కలను
ఖరీదు కట్టనీకి
ఎన్ని మాయలో!
ఎన్ని జనమలెత్తినా
ఈ నెత్తిన తట్ట మారలే!
కరకరమని ఎముకలు
విరుగుతున్నా
తప్పని మోత!
ఎన్ని ప్రణాళికలు వేసినా
అవి మా కన్నీటిని
తుడవకపోగా
మరింతగా మా
మూలుగును
పీలుస్తూనే వున్నాయి!
ఈ రూపాయి
సంబంధమిలా వుండగా
పెనిమిటి లమ్డీ కొడుకు
మగపురుగు బుద్ధిని
మాపై రుద్దకమానడు!
అరకొర కస్టాన్ని
తానొక్కడి సంతోసానికి
మింగి మళ్ళీ నాపై
అఘాయిత్యం సేస్తానే వుంటాడు!
ఆకాసం సూడనీకుండా
తట్టడు బరువు నెత్తిన!
తళుకు సీరల
అమ్మలుది
ఓ బాధైతే
నాది నిరంతర
ఱంపపు కోత!!
(అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా)
Subscribe to:
Post Comments (Atom)
చాలా చాలా బాగా రాసారు..
ReplyDeleteశివ గారు ధన్యవాదాలు..
ReplyDeleteబాగా రాసారు..
ReplyDeleteపద్మార్పితగారూ ధన్యవాదాలండీ..
ReplyDeleteకేక్యూబ్ గారికి, నమస్కారములు.
ReplyDelete`కలలను కత్తిరిస్తున్న వేళ' మరియు ఈ కవిత చాలా బాగున్నాయి. నాడు, నేడుకూడా స్త్రీ ఆంతర్యాన్ని తెలుసుకోవాలంటే, ప్రతి పురుషుడు ఎప్పుడో ఒకసారైనా స్త్రీగా పుట్టితీరవల్సిందే.
మీ స్నేహశీలి,
మాధవరావు.